Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాట‌ర్‌గా దుమ్ములేపాడు.. కానీ కెప్టెన్‌గా ఫెయిల్‌! ఈ ఏడాది రూట్‌కు 50-50

joe root in 2021 year Excellent batting, but as a captain fail

ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువ‌గా వినిపించిన పేరు జో రూట్‌. ఎందుకంటే ఈ ఏడాది బ్యాటింగ్‌లో జో రోట్ జోరు అలా కొన‌సాగింది. పిచ్ ఎక్క‌డైనా, బౌల‌ర్ ఎవ‌రైనా, టీం ఏదైనా రూట్ ప‌రుగుల దాహానికి బ్రేక్ వేయ‌లేక‌పోయాయి. సునాయ‌సంగా ప‌రుగులు రాబ‌డుతూ హాఫ్ సెంచ‌రీలు, సెంచ‌రీల‌తో 2021 సంవ‌త్స‌రంలో దుమ్ములేపాడు. ప్ర‌త్య‌ర్థి, బౌల‌ర్, పిచ్ ఇలా దేనిని ప‌ట్టించుకోకుండా క‌సి తీరా బంతిని బాదేశాడు. ఈ క్ర‌మంలో అనేక రికార్డుల‌ను కూడా బ‌ద్ద‌లు కొట్టాడు. కుల్‌గా క‌నిపించే ఈ టాలెంటెడ్ బ్యాట‌ర్‌ గ్రౌండ్ ఏదైనా సారి ప‌రుగుల సునామీ సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

టీం చేసిన స్కోర్లో స‌గం రూట్‌దే

టీం చేసిన స్కోర్లో స‌గం రూట్‌దే

బౌల‌ర్ల‌కు అంతుచిక్కని అస్త్రాలు ఏవో త‌న ద‌గ్గ‌ర పెట్టుకోని 2021 ఏడాది అంత సంపూర్ణ అధిప‌త్యాన్ని చెలాయించాడు. ఇంగ్లండ్ టీం అంటే రూటే అన్న‌ట్టుగా శాసించాడు. చాలా మ్యాచ్‌ల్లో టీం చేసిన స్కోర్లో స‌గం రూట్‌దే ఉన్న‌ది అంటే అత‌ని హ‌వా ఈ ఏడాది ఏ రేంజులో సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. జ‌ట్టులోని మిగ‌తా బ్యాట‌ర్లు ఎవ‌రూ రాణించ‌క‌పోయినా తాను ఒక్క‌డిగా ఆడి టీంను ఒడ్డుకు చేర్చాడు. ఈ క్ర‌మంలో ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.

బ్యాటింగ్‌లో టాప్‌

బ్యాటింగ్‌లో టాప్‌

2021లో మొత్తంగా 15 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు రూట్‌. 29 ఇన్నింగ్స్‌ల్లో 61 స‌గ‌టుతో 1708 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 4 హాఫె సెంచ‌రీలు ఉన్నాయి. ఓ సారి డ‌బుల్ సెంచ‌రీ మార్కును కూడా అందుకున్నాడు. అత్య‌ధికంగా 228 ప‌రుగులు చేశాడు. ఇంగ్లండ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో రూట్ ఏకంగా 94 స‌గ‌టుతో ప‌రుగులు చేయ‌డం విశేషం. మొత్తం 4 టెస్టు మ్యాచ్‌ల్లోని 7 ఇన్నింగ్స్‌ల్లో 564 ప‌రుగులు చేశాడు.

ఇందులో 3 సెంచ‌రీలు, ఒక హాఫ్ సెంచ‌రీ ఉన్నాయి. ఆ సిరీస్‌లో అత్య‌ధికంగా ఓ మ్యాచ్‌లో 180 ప‌రుగులు చేశాడు. ఇలా ఈ ఏడాది ఇంగ్లండ్ ఆడిన అన్ని టెస్టు సిరీస్‌ల్లో రూట్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. భార‌త ప‌ర్య‌ట‌న‌లో డ‌బుల్ సెంచ‌రీ కూడా బాదాడు. ప్ర‌స్తుతం యాషెస్ సిరీస్‌లోనూ ఇంగ్లండ్ త‌ర‌ఫున రూట్ మాత్ర‌మే మంచి స్కోర్లు సాధిస్తున్నాడు.

 కెప్టెన్‌గా మాత్రం ఫెయిల్

కెప్టెన్‌గా మాత్రం ఫెయిల్

ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ఓ రేంజులో చెల‌రేగిన జో రూట్.. కెప్టెన్‌గా మాత్రం చేతులెత్తేశాడు. నిజానికి ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా రూట్‌కు ఏది క‌లిసి రాలేదు. ఆడిన అన్ని సిరీస్‌లు ఓడిపోయింది. రూట్ కెప్టెన్సీలో ఇండియాతో ఇంటా, బ‌య‌ట టెస్ట్ సిరీస్‌ల్లో ఓడిన ఇంగ్లండ్‌.. న్యూజిలాండ్‌తోనూ హోంగ్రౌండ్‌లో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది.

మొత్తంగా ఈ ఏడాది 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 9 మ్యాచ్‌ల్లో ఓడింది. 4 మాత్రమే గెలిచి, రెండు డ్రా చేసుకుంది. ఒక ఏడాదిలో అత్య‌ధిక టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. రూట్ మిన‌హా ఇత‌రు బ్యాట‌ర్లు ఎవ‌రూ రాణించ‌లేక పోవ‌డం కూడా దీనికి ఒక కార‌ణం. దీంతో కెప్టెన్‌గా రూట్ రాణించ‌లేకపోతున్నాడ‌ని, అత‌ని కెప్టెన్సీ నుంచి తొల‌గించాల‌ని ఇంగ్లండ్ మాజీలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఈ ఏడాది బ్యాట‌ర్‌గా రాణించిన‌ప్పటికీ, కెప్టెన్‌గా విఫ‌ల‌మ‌వ‌డంతో రూట్‌కు 2021 సంవ‌త్సంర 50-50 గా నిలిచిపోయింది.

Story first published: Wednesday, December 29, 2021, 12:57 [IST]
Other articles published on Dec 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+