స్టోక్స్.. గ్రౌండ్‌లోనే పోయావా? విరగబడి నవ్విన జో రూట్.. నెట్టింట వైరల్!

మాంచెస్టర్: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రెండో రోజు చోటు చేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ సంఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అయితే విరగబడి నవ్వాడు.

ఇంతకేం జరిగిందంటే..

స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ ప్యాంట్‌పై గోధుమ కలర్ మరక అయింది. అది కూడా వెనుకబాగంలో కావడంతో స్టోక్స్ ప్యాంట్‌లోనే బాత్రూమ్ పోయినట్లు కనిపించింది.

అది ఎవరికి కనబడకుండా స్టోక్స్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ పక్కన ఉన్న జోరూట్ దీన్ని పసిగట్టి నవ్వు ఆపుకోలేకపోయాడు. విరగబడి మరి నవ్వాడు. దీంతో స్టోక్స్ కూడా నవ్వుతూ తన ప్యాంట్‌ను సర్దుకుంటున్నట్లు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

1990 ఘటనతో పోలుస్తూ..

1990 ఘటనతో పోలుస్తూ..

అయితే నెటిజన్లు ఈ ఘటనను 1990లో ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్ గ్యారీ లినేకర్ సంఘటనతో పోలుస్తూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఓ మ్యాచ్ సందర్భంగా లినేకర్ అనుకోకుండా మైదానంలోనే బాత్రూమ్ పోయాడు. దీంతో ఆ ఘటనతో ముడిపెడుతూ స్టోక్స్‌ను ఆటాడుకుంటున్నారు. ‘గ్యారీ ఇక నువ్వు ఒక్కడివే కాదు.. నీకు జతగా స్టోక్స్ కూడా చేరాడు'అని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన గ్యారీ లినేకర్.. అప్పుడప్పుడు ఇలాంటి చెత్త ఘటనలు మైదానంలో జరుగుతుంటాయని కామెంట్ చేశాడు. దీనికి స్టోక్స్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు.

విజయం దిశగా ఇంగ్లండ్

విజయం దిశగా ఇంగ్లండ్

ఇక స్టువర్ట్ బ్రాడ్(6/31) సూప‌ర్ బౌలింగ్‌కు తోడు.. రోరీ బర్న్స్ (163 బంతుల్లో 10 ఫోర్లతో 90) వీరోచిత బ్యాటింగ్‌తో చెలరేగడంతో... నిర్ణయాత్మక మూడో టెస్ట్ ఇంగ్లండ్ చేతుల్లోకి వచ్చేసింది. బౌలింగ్‌లో విఫలమైన విండీస్.. బ్యాటింగ్‌లోనూ తడబడటంతో.. ఆతిథ్య జట్టు మూడో రోజే పట్టు బిగించింది. హోల్డర్(82 బంతుల్లో 6 ఫోర్లతో 46), డౌరిచ్(37) పోరాటంతో ఫాలో ఆన్ తప్పించుకున్న కరీబియన్ల ముందు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

దీనిని అధిగమించే క్రమంలో విండీస్ అప్పుడే రెండు వికెట్లను చేజార్చుకొని ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 10 రన్స్ చేసింది. బ్రాత్‌వైట్‌ (2 బ్యాటింగ్‌), హోప్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఇక అద్భుతం జరిగితే తప్ప ఓటమి నుంచి గట్టెక్కడం విండీస్ వీరులకు ఆసాధ్యం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గెలుపు నేడే జరగొచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 27, 2020, 15:12 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X