

లండన్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో యువ ఆటగాడు ఒలీ పోప్ అరంగేట్రం చేయనున్నాడని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ తెలిపాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి లార్డ్స్‌లో ప్రారంభం కానుంది.
రెండో టెస్టుకు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న జో రూట్ లార్డ్స్ టెస్టులో ఒలీ పోప్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని రూట్ స్పష్టం చేశాడు. తొలి టెస్టులో 31 పరుగులు చేసి స్లిప్‌లో క్యాచ్‌లు జారవిడిన డేవిడ్ మలన్ స్థానంలో అతడు అరంగేట్రం చేయనున్నట్లు జో రూట్ తెలిపాడు.
ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో సర్రే తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పోప్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రెండో టెస్టు కోసం ప్రకటించిన జట్టు నుంచి ఇంగ్లాండ్ పేసర్ జేమీ పోర్టర్‌ను 13 మంది సభ్యుల జట్టు నుంచి తొలగించారు. ఇక, కోర్టు విచారణ సందర్భంగా లార్డ్స్ టెస్టుకు బెన్ స్టోక్స్ దూరమైన సంగతి తెలిసిందే.
అతడి స్థానంలో మొయిన్ అలీ లేదా క్రిస్‌వోక్స్ ఆడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో టాస్ ఆలస్యంగా పడనుంది. వర్షం కారణంగా మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు.
12 మంది సభ్యుల ఇంగ్లాండ్ జట్టు:
జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, అలిస్టర్ కుక్, శామ్ కరన్, కీటన్ జెన్నింగ్స్, ఒలివ్ పోప్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్.