Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes Series 2021: స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన జో రూట్‌

Joe Root Breaks Sachin Tendulkars Record

ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో జ‌రుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రికార్డు సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా పింక్‌బాల్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును రూట్ బ‌ద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే కాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో స‌చిన్‌ను ఈ ఏడాది రూట్ అధిగ‌మించాడు. ఈ జాబితాలో మాష్ట‌ర్ బ్లాష్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఒకే ఏడాదిలో 1,562 ప‌రుగులు చేశాడు.

2010లో స‌చిన్ ఈ ఘ‌న‌త సాధించాడు. మొత్తంగా ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో స‌చిన్ ఇదివ‌ర‌కు ఐదో స్థానంలో ఉండేవాడు. కానీ తాజాగా యాషెస్ రెండో టెస్టులో 62 ప‌రుగులు చేయ‌డం ద్వారా స‌చిన్‌ను రూట్ అధిగ‌మించ‌డంతో టెండూల్క‌ర్ ఆరో స్థానానికి ప‌డిపోయాడు. స‌చిన్ స్థానాన్ని రూట్ ఆక్ర‌మించాడు.

జాబితాలో ఎవ‌రు? ఏ స్థానంలో?

ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 2006లో యూసూఫ్ 1,788 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాతి స్థానంలో వెస్టిండీస్ గ్రేట్ బ్యాట‌ర్ వివి రిచ‌ర్డ్స్ ఉన్నాడు. 1976లో రిచ‌ర్డ్స్ 1,710 ప‌రుగులు చేశాడు. ఇక మూడో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. 2008లో స్మిత్ 1,656 ప‌రుగులు చేశాడు. నాల్గో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఉన్నాడు. క్లార్క్ 2012లో 1,595 ప‌రుగులు చేశాడు. ఇక తాజాగా ఐదో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఉన్నాడు. ఆ త‌ర్వాతి స్థానంలో స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడు. కాగా ఈ టెస్టు మ్యాచ్‌లో రూట్ మ‌రో 115 ప‌రుగులు చేస్తే ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌(1,656)ను అధిగ‌మిస్తాడు.

Joe Root Breaks Sachin Tendulkars Record

జో రూట్ రికార్డులు

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 111 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 50 సగ‌టుతో 9,429 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 డ‌బుల్ సెంచ‌రీల‌తోపాటు 23 సెంచ‌రీలు, 52 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అలాగే 152 వ‌న్డే మ్యాచ్‌లు ఆడి 51 స‌గ‌టుతో 6,109 ప‌రుగులు చేశాడు. ఇందులో 16 సెంచ‌రీలు, 35 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అదే విధంగా 32 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 35 స‌గ‌టుతో 893 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

Story first published: Saturday, December 18, 2021, 13:26 [IST]
Other articles published on Dec 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+