Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌తో టెస్టు సిరిస్‌కు ఆసీస్ జట్టిదే: మానసిక సమస్యతో తప్పుకున్న పుకౌస్వి, అసలేం జరుగుతోంది?

Joe Burns, Cameron Bancroft return to Australia Test squad for Pakistan series

హైదరాబాద్: పాకిస్థాన్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్‌ను టెస్ట్ జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు అతడి స్థానంలో క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్‌కు చోటు కల్పించారు. పాక్‌తో టెస్టు సిరిస్‌కు మొత్తం 14 మందితో కూడిన జట్టు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఎంపిక చేసింది.

కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. నవంబర్ 21 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో అన్‌క్యాప్‌డ్‌ బౌలర్‌ మైకేల్‌ నాసెర్‌కు సైతం సెలక్టర్లు చోటు కల్పించారు. మిచెల్‌ స్టార్క్‌, హజల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌ లాంటి సీనియర్ పేసర్లతో కూడిన బౌలింగ్‌ దళంలో నాసెర్‌ చోటు దక్కించుకున్నాడు.

తనకు తానుగా తప్పుకున్న విల్‌ పుకౌస్వి

తనకు తానుగా తప్పుకున్న విల్‌ పుకౌస్వి

ఇదిలా ఉంటే, పాక్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టులో చోటు ఖాయమనుకున్న సమయంలో విల్‌ పుకౌస్వి తనకు తానుగా తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు సెలక్షన్‌లో అతని పేరు పరిశీలనలో ఉండగా ఈ సిరిస్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో డబుల్ సెంచరీ

దేశవాళీ క్రికెట్‌లో డబుల్ సెంచరీ

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు డబుల్‌ సెంచరీ సాధించిన విల్‌ పుకౌస్విను పాక్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టులోకి తీసుకోవాలని సీఏ భావించింది. అయితే తనకు మానసిక సమస్యలు ఉన్నాయంటూ అతను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు విన్నవించడం విశేషం.

విల్‌ పేరును పక్కన పెట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా

విల్‌ పేరును పక్కన పెట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా

అతడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా విల్‌ పేరును పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది. మానసికంగా ఇబ్బంది పడుతున్న కారణంగానే తాను తప్పుకుంటున్నట్లు పేర్కొన్నట్లు సీఏ తెలిపింది. దాంతోనే తుది నిమిషంలో విల్‌ను తప్పించాల్సి వచ్చిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది.

మానసిక సమస్యల కారణంగా

మానసిక సమస్యల కారణంగా

కాగా, ఇప్పటికే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, నిక్‌ మ్యాడిన్‌సన్‌ లాంటి క్రికెటర్లు మానసిక సమస్యల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు వారాల వ్యవధిలో ఒకే కారణంతో ముగ్గురు ఆటగాళ్లు మానసిక సమస్యను కారణంగా చూపుతూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

పాక్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా జట్టు

పాక్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా జట్టు

డేవిడ్‌ వార్నర్‌, జో బర్న్స్‌, లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, బాన్‌క్రాఫ్ట్‌, మాథ్యూవేడ్‌, టిమ్‌పైన్‌, నాథన్‌ లయన్‌, ప్యాట్‌ కమిన్స్‌, హజల్‌వుడ్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌, మైకేల్‌ నాసెర్‌

Story first published: Thursday, November 14, 2019, 12:50 [IST]
Other articles published on Nov 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+