బుడ్డోడిని ర్యాగింగ్ చేసిన ఆర్సీబీ ఆటగాడు! (వీడియో)
రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ, ఆర్సీబీ ఆటగాడు జితేష్ శర్మ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్యాట్ కోసం పట్టుబట్టిన జితేష్ శర్మ
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ సరదాగా వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ అడిగాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తీసుకోగానే జితేష్ "థాంక్యూ" అని చెప్పి వెళ్లబోతుంటే.. వైభవ్ సూర్యవంశీ వెంటనే స్పందించి "ఓ భాయ్.. నా బ్యాట్ నాకు ఇచ్చేయ్, దీని గురించి తర్వాత మాట్లాడదాం" అంటూ తన బ్యాట్‌ను వైభవ్ వెనక్కి తీసుకున్నాడు.

ఐపీఎల్ తర్వాత ఇస్తానన్న వైభవ్ సూర్యవంశీ
ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ నవ్వుతూ జితేష్ శర్మపై కౌంటర్ వేశాడు. "మీ టీమ్‌లో ఇంతమంది గొప్ప బ్యాటర్లు ఉండగా వారినెవరినీ అడగకుండా నా బ్యాట్ ఎందుకు అడుగుతున్నారు?" అని ప్రశ్నించాడు. దానికి జితేష్ సమాధానమిస్తూ.. తాను ఎవరినీ అడగలేదని.. కేవలం ఇతని బ్యాట్ మాత్రమే కావాలని కోరాడు. అప్పుడు వైభవ్ సూర్యవంశీ ఓ మాట ఇచ్చాడు. "నేను మీకు ముందే చెప్పాను కదా.. ఐపీఎల్ ముగిసిన తర్వాత నా బ్యాట్ మీకు ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు కావాలని పట్టుబట్టడం ఏంటి?" అని వైభవ్ సూర్యవంశీ సరదాగా నిలదీశాడు.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
వైభవ్, జితేష్ శర్మ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, బయట వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. వైభవ్ తన బ్యాట్‌ను ఐపీఎల్ తర్వాత ఇస్తానని మాట ఇవ్వడం అతనిలోని వినయానికి నిదర్శనమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కలిసి ఆడిన యువ కెరటాలు
వైభవ్ సూర్యవంశీ, జితేష్ శర్మ ఇద్దరూ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025లో కలిసి ఆడాడు. ఆ టోర్నీలో జితేష్ శర్మ కెప్టెన్సీలో వైభవ్ ఆడాడు. ఆ స్నేహం నేపథ్యంలోనే జితేష్ శర్మ వైభవ్ సూర్యవంశీతో సరదాగా మాట్లాడాడు. ఇదిలా ఉండగా.. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. గతేడాది కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో కూడా తన జోరును కొనసాగిస్తూ సీఎస్కేపై 52, గుజరాత్ మీద 31, ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. బుమ్రా వేసిన తొలి బంతికే సిక్స్ కొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
ఈరోజే రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు ఈరోజు గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. 7 గంటలకు టాస్ పడనుంది. తన బ్యాట్‌తో బౌలర్ల పని పడుతున్న వైభవ్, ఈరోజు ఆర్‌సీబీ బౌలర్లపై ఎలాంటి విరుచుకుపడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications