ఐపీఎల్ స్ఫాన్సర్ రేసులో జియో, పతాంజలి!!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం సన్నద్ధమవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కీలక సమయంలో షాక్ తగిలిన విషయం తెలిసిందే. టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న చైనా ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ 'వివో' లీగ్‌తో భాగస్వామ్యాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంది. బోర్డు వైపు నుంచి ఎలాంటి సమస్యా లేకపోయినా.. చైనాకు చెందిన కంపెనీ కావడంతో 'వివో'పై గత రెండు రోజులుగా విమర్శల పర్వం తీవ్రంగా సాగింది. దాంతో 'వివో' వెనక్కి తగ్గినట్లు సమాచారం.

కొత్త టైటిల్ స్ఫాన్సర్ కోసం
ఐపీఎల్ స్పాన్సర్‌గా ఉన్న 'వివో' తప్పుకోవడంతో కొత్త టైటిల్ స్ఫాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ తక్కువ వ్యవధిలో భారత్‌కి చెందిన స్ఫాన్సర్‌ని వెతికి పట్టుకునే పనిలో బీసీసీఐ పెద్దలు బిజీగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 2018-2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్‌కు రూ. 2199 కోట్ల (ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున)కు వివో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కొత్త టైటిల్ స్పాన్సర్ నుండి బీసీసీఐకి ఇంత మొత్తం పొందకపోవచ్చని అంచనా. అందుకే ఒకటి లేదా రెండు సంవత్సరాలకు 250 లేదా 300 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐ చూస్తోందట.

బీసీసీఐపై విమర్శల వర్షం
గల్వాన్ లోయలో చైనా చేతిలో భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలోనూ 'వివో'తో జత కట్టడంపై కొందరు బహిరంగంగా బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టగా.. పెద్ద సంఖ్యలో అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. చైనాకి చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని ప్రస్తావించిన అభిమానులు.. డబ్బు కోసం సైనికుల త్యాగాల్ని పణంగా పెడతారా? అంటూ బీసీసీఐపై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా Indian Premier Leagueని Chinese Premier Leagueగా మార్చేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు.

జియో, పతాంజలి పేర్లు
ఇక కొత్త స్పాన్సర్‌ని పట్టుకోవాలని బీసీసీఐ యోచిస్తుండగా.. భారత్‌కి చెందిన కొన్ని కంపెనీ పేర్లని బీసీసీఐకి అభిమానులు సూచిస్తున్నారు. అందులో ప్రముఖంగా జియో, పతాంజలి పేర్లు వినిపిస్తున్నాయి. జియో, పతాంజలి ఐపీఎల్ స్పాన్సర్‌గా తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండగా.. మునుపటిలా టోర్నీకి ఆదరణ లభించకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివో తరహాలో కొత్త స్ఫాన్సర్ అంత భారీ మొత్తాన్ని చెల్లించకపోవచ్చు.
నేను సెంచరీ చేసినప్పుడు.. లక్ష్మణ్ కిందపడి మరీ సంబరాలు చేసుకున్నాడు: కుంబ్లే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications