#OnThisDay in 1956: ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు

హైదరాబాద్: జిమ్ లేకర్... అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్. అయితే, సరిగ్గా ఇదే రోజు(జూలై 31) 1956లో జిమ్ లేకర్ ఈ రికార్డును నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. అప్పట్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
అంతేకాదు జిమ్‌లేకర్‌లా ఈ ఘనతను అందుకున్న బౌలర్ ఎవరైనా గుర్తుకువస్తున్నారా? అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా, జిమ్ లేకర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నిలిచాడు. 1999లో పాక్‌పై కుంబ్లే ఈ ఘనత సాధించాడు.

ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172కే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

పాక్ ఓపెనర్లు శుభారంభం
రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 101 పరుగుల వద్ద షాహిద్ అఫ్రిదిని ఔట్ చేసి అనిల్ కుంబ్లే తన దండయాత్రను మొదలుపెట్టాడు. వరసపెట్టి వికెట్లు తీస్తూ 207 పరుగులకే పాక్‌ను కుప్పకూల్చాడు. భారత్‌కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. 10/74 గణాంకాలతో చరిత్ర సృష్టించాడు.

ఎవరూ ఈ ఘనత సాధించలేదు
వీరి తర్వాత టెస్టుల్లో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం రెక్స్ రాజ్‌సింగ్(మణిపూర్), దాబాషిష్ మొహాంతీలు ఈ ఘనత సాధించారు. ఇక, జిమ్ లేకర్ విషయానికి వస్తే 1946 నుంచి 1959లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 46 మ్యాచ్‌లాడి 193 వికెట్లు తీశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు
19 వికెట్లు పడగొట్టిన అప్పటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 16.4 ఓవర్లు బౌలింగ్ చేసి 37 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు. ఇక, రెండో ఇన్నింగ్స్ 51.2 ఓవర్లు వేసి 53 పరుగులతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications