
దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో మళ్లీ టీమిండియా విజయఢంకా మోగించింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఫీల్డింగ్ కోసమని బౌండరీ లైను వద్దకు రాగానే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ భర్త అనే విషయం తెలిసిందే.
దీంతో షోయబ్‌నుస్టేడియంలోని అభిమానులంతా బావా.. అంటూ కేకలు మొదలుపెట్టారు. 'షోయబ్ జీజూ(బావ).. ఒకసారి ఇటు చూడవా' అంటూ వేసిన కేకలకు అభిమానులు స్పందించారు. నేపథ్యంలో షోయబ్ మైదానంలో నుంచే వెనక్కి తిరిగి వారికి హాయ్ చెప్పారు. అభిమానులు 'బావ' అంటూ కేకలు వేస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులు ట్విటర్‌లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను అలవోకగా ఓడించిన భారత్.. సూపర్-4లో ఆ జట్టు పని పట్టింది. ఆదివారం 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. షోయబ్ మాలిక్ (78) 90 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సులు, సర్ఫ్‌రాజ్ అహ్మద్ (44) 66 బంతుల్లో 2ఫోర్లతో రాణించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులే చేయగలిగింది.
పాక్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. టీమిండియా మంగళవారం (సెప్టెంబరు 25) తన చివరి సూపర్-4 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. సూపర్-4లో రెండు భారీ విజయాలతో భారత్ దాదాపుగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. రెండో బెర్తు కోసం మిగతా జట్లు పోటీ పడాలి.