అరుదైన రికార్డు: వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా జులన్

హైదరాబాద్: భారత మహిళా జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జులన్ ఈ రికార్డు నెలకొల్పింది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఓపెనర్ లూరా (9) వికెట్‌ని తీసిన జులన్ గోస్వామి కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకుంది. తన 166వ వన్డేలో జులన్ గోస్వామి ఈ ఘనత సాధించడం విశేషం.
ఈ సిరిస్ ఆరంభానికి ముందు 195 వికెట్లతో ఉన్న జులన్ గోస్వామి తొలి వన్డేలో 4 వికెట్లు తీయగా, రెండో వన్డేలో ఒక వికెట్ తీయడం ద్వారా ఈ ఘనతను అందుకుంది. ఇప్పటికే బ్యాట్‌తో 1,000 పరుగులు, బంతితో 150 వికెట్లు తీసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా జులన్ ఖాతాలో మరో రికార్డు ఉంది.
35 ఏళ్ల జులన్ గోస్వామి 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఈ ఏడాది మొదట్లో మహిళల ముక్కోణపు సిరిస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనే మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మూడు ఫార్మాట్లలో కలిసి జులన్ మొత్తం 290 వికెట్లు (టెస్టుల్లో 40, వన్డేల్లో 200, టీ20ల్లో 50) వికెట్లు తీసుకుంది. 2002లో భారత్ తరుపున అరంగేట్రం చేసిన తర్వాత మహిళా జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతోంది. 2007లో ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఇయర్ ఆఫ్ ద అవార్డుని కూడా గెలుచుకుంది.
మహిళా క్రికెట్‌లో జులన్ గోస్వామి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2009లో అర్జున అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు గాను ఆమెను పద్మశ్రీ అవార్డు వరించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications