ఆశ్చర్యపరిచాడు: తెల్లటి గడ్డంతో ఈడెన్‌లో ధోని ప్రాక్టీస్
హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో కోహ్లీ సేన బిజీ బిజీగా ఉంటే, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈడెన్ గార్డెన్స్‌లో తన జార్ఖండ్ జట్టు ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడిపాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ధోనీ సహచరులతో కలిసి గురువారం ఈడెన్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యాడు.
జార్ఖండ్ జట్టు జెర్సీలో వచ్చిన ధోని జట్టులోని మిగతా ఆటగాళ్లతో కలిసి చాలా సేపు పుట్ బాల్ ఆడాడు. ఆ తర్వాత సహచరులకు బ్యాటింగ్‌లో ధోని కొన్ని సూచనలిచ్చ్చాడు. అనంతరం వారితో చాలా సరదాగా గడిపాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ధోని తళతళ మెరిసే తెల్ల గడ్డంతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కర్ణాటక జట్టుతో తలపడనున్న ధోనీ సేన
హజారే ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 25న జరిగే తొలి మ్యాచ్‌లో కర్ణాటక జట్టుతో ధోనీ సేన తలపడనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది విజయ్ హాజారే ట్రోఫీలో స్టార్ క్రికెటర్లు ఆడుతండటం విశేషం.

చాలామంది సీనియర్లు
దేశవాళీ వన్డే టోర్నీగా భావించే ఇందులో ధోని, యువరాజ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, మనీష్ పాండేలతో పాటు చాలామంది సీనియర్లు ఆడుతున్నారు.

సత్తా చాటేందుకు సిద్ధమైన యువ ఆటగాళ్లు
ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక కోసం విజయ్ హజారే ట్రోఫీలో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటామని సెలక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఈ టోర్నీలో సత్తా చాటాలని చాలా మంది యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

28 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి
మొత్తం 28 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి విజయ్ హజారే ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి. శనివారం గ్రూప్ సీలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ జట్టు బెంగాల్‌ను గ్రూప్ డిలో హైదరాబాద్ జట్టు జమ్మూకాశ్మీర్‌తో ఆడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications