వామ్మో జెమీమా.. నీలో ఆ కళ కూడా ఉందా (వీడియో)!!

మెల్‌బోర్న్: భారత మహిళా క్రికెట్ జట్టులో ప్రస్తుతం యువ ప్లేయర్లే ఎక్కువగా ఉన్నారు. షెఫాలీ వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, స్మృతి మంధాన, రిచా ఘోష్ వీరందరూ 23 ఏళ్ల లోపు వారే ఉన్నారు. యువ ప్లేయర్ల రాకతో డ్రెస్సింగ్ రూమ్‌లో హుషారు, ఫన్ ఎక్కువైంది. ఇదే విషయాన్ని ఇటీవలే ఐసీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ అల్లరి ఎక్కువట. సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్‌తో ఆమె చేసే సందడి బాగుంటుందట. అదే అల్లరితో జెమిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

సెక్యూరిటీ గార్డుతో డ్యాన్స్:
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడింది. అయితే బుధవారం రోజు ప్రాక్టీస్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు బయల్దేరిన రోడ్రిగ్స్ .. అక్కడ ఉన్న ఓ లేడీ సెక్యూరిటీ గార్డుతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. స్పెషల్ డాన్సర్ మల్లే సెక్యూరిటీ గార్డుతో కాలు కదిపింది. ఆ సెక్యూరిటీ గార్డు.. రోడ్రిగ్స్‌ను అనుకరిస్తూ డాన్స్ చేసింది. రోడ్రిగ్స్‌కు ఐసీసీ కూడా ఫిదా అయింది. చాలా ఫన్‌గా ఉన్న ఆ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
వామ్మో జెమీమా:
ఐసీసీ పుణ్యమా అని ప్రస్తుతం రోడ్రిగ్స్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్రిగ్స్ డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్‌లతో ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి వాటితో కాస్త ఉపశమనం పొందుతారు' అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. 'వామ్మో జెమీమా.. నీలో ఆ కళ కూడా ఉందా' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'డ్యాన్స్ బాగుంది. ప్రపంచకప్ ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుందని' మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

క్రీజులో ఉంటే కొండంత బలం:
జెమిమా రోడ్రిగ్స్ జట్టులోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ.. ఇప్పటికే ఎంతో పరిణితి చెందింది. ఆమె క్రీజులో ఉందంటే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు కొండంత బలం. క్లిష్ట సమయాలలో నిలకడగా, ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ అందరి మన్ననలను పొందుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా తనదైన ఆటతో ఆకట్టుకుంటోంది.

సెమీస్ బెర్త్ ఖరారు:
మహిళల టీ20 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అమ్మాయిలు మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఓవెల్ వేదికగా న్యూజిలాండ్‌తో ఈ రోజు జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని.. మెగా టోర్నీ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. అమెలియా కెర్ర్ (34; 18 బంతుల్లో 6x4) ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడినా కివీస్ గెలుపొందలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications