Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోట్ల క్వీన్ జెమీమా: 25 ఏళ్లకే ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Jemimah Rodrigues Net Worth: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఐసీసీ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో దుమ్మురేపింది. ఆస్ట్రేలియాపై జరిగిన సెమీస్‌లో జెమీమా రోడ్రిగ్స్(127*) అద్భుత సెంచరీతో భారత జట్టును ఫైనల్‌కు చేర్చింది. మైదానంలో తన ఆటతోనే కాకుండా స్టేడియం బయట తన బ్రాండింగ్, సంపాదనతో కూడా జెమీమా రోడ్రిగ్స్ సంచలనం సృష్టిస్తోంది.

సెమీ-ఫైనల్లో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్
24 ఏళ్ల జెమీమా ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ వంటి అతిపెద్ద వేదికపై తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆమె 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె వీరోచిత శతకం కారణంగా భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Jemimah Rodrigues Net Worth The Millionaire Queen of Indian Womens Cricket at 25

జెమీమా రోడ్రిగ్స్ నికర విలువ ఎంత?
జెమీమా రోడ్రిగ్స్ ఆటతో పాటు తన పెరుగుతున్న ప్రజాదరణను డబ్బుగా కూడా మలుచుకుంటోంది. ఆమె బలమైన బ్రాండ్ పోర్ట్‌ఫోలియో , ఆర్థిక వనరులు పెరుగుతున్న ఆమె నికర విలువలో స్పష్టంగా కనిపిస్తాయి: ఆమెకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ బీ కింద సంవత్సరానికి రూ. 30 లక్షలు లభిస్తాయి. మ్యాచ్ ఫీజులు చూస్తే టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20కి రూ. 3 లక్షలు చొప్పున ఆమెకు మ్యాచ్ ఫీజు లభిస్తుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆమెను రూ. 2.2 కోట్లకు రిటైన్ చేసుకుంది.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్: హ్యుందాయ్, జిల్లెట్, రెడ్ బుల్, డ్రీమ్11, ప్లాటినం ఇవారా వంటి అనేక పెద్ద అంతర్జాతీయ , జాతీయ బ్రాండ్‌లకు జెమిమా అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వివిధ నివేదికల అంచనా ప్రకారం.. 2025 నాటికి జెమీమా రోడ్రిగ్స్ మొత్తం నికర విలువ రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్ల మధ్య ఉండవచ్చు. 25 ఏళ్ల వయస్సులోనే ఆమె ఈ స్థాయిలో సంపాదన సాధించడం విశేషం.

ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత్
జెమీమా రోడ్రిగ్స్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించి భారత్ మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్‌లో భారత్ మరో తొలి టైటిల్ వేటలో ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌కు కొత్త విజేత లభించడం ఖాయం.

Story first published: Friday, October 31, 2025, 11:36 [IST]
Other articles published on Oct 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+