ICC Women's T20I Rankings: టాప్ 10లోకి జెమీమా రోడ్రిగ్స్, భారత స్టార్ల ర్యాంకులివే..!

భారత టాపార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో రాణిస్తుండడంతో తాజాగా విడుదల చేసిన ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఆమె చేరింది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోడ్రిగ్స్ 4స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇకపోతే భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మూడో ర్యాంకులో, షఫాలీ వర్మ ఏడో ర్యాంకులో కొనసాగుతుంది. టాప్ 10లో మొత్తం ముగ్గురు భారత మహిళ క్రికెటర్లు ఉన్నారు. ఇకపోతే ఆసియాకప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్ అక్టోబర్ 1న సిల్హెట్‌లో శ్రీలంకతో జరిగింది. ఈ మ్యాచ్‌లో రోడ్రిగ్స్ 76పరుగులు చేసింది. ఆమె బ్యాట్‌తో తన మెరుపును ఇలాగే కొనసాగిస్తే ఆమె ర్యాంకు మరింత మెరుగవ్వొచ్చు.

రెండు స్థానాలు ఎగబాకిన హర్మన్ ప్రీత్
ఇకపోతే ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో ర్యాంకులో ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె సారథ్యంలో ఆసీస్ జట్టు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక క్రికెట్‌కు కొంతకాలంగా నిరవధిక విరామాన్ని ప్రకటిస్తూ మెగ్ లానింగ్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచింది.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంకుకు దీప్తి
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ ఒక స్థానం దిగజారి 6వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇటీవల లార్డ్స్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేయడంతో దీప్తి శర్మ వార్తల్లొకెక్కింది. చేతి నుండి బంతిని రిలీజ్ చేయడానికి ముందే క్రీజును వదిలిన ఛార్లీ డీన్‌ను దీప్తి రనౌట్ చేసింది. దీనిపై విపరీతంగా విశ్లేషణలు, కామెంట్లు వచ్చాయి. ఇంగ్లాండ్ మాజీ, ప్రస్తుత క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించగా.. భారత మాజీలు, విశ్లేషకులు దీప్తి క్రికెట్ చట్టాల ప్రకారమే ఔట్ చేసిందని.. ఆమె కరెక్ట్ అంటూ వత్తాసు పలికారు.

ఆసియా కప్‌లో అదరగొడుతున్న ఇండియా
ఇకపోతే వుమెన్స్ క్రికెట్లో బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఆల్రౌండర్ల విషయానికొస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ అగ్రస్థానంలో ఉంది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఎప్పటిలాగే నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతుంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో అదరగొడుతుంది. అక్టోబర్ 1నుంచి అక్టోబర్ 15 వరకు బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం ఏడు జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇకపోతే హర్మన్‌ప్రీత్ సారథ్యంలో ఇండియా వుమెన్స్ తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, మలేషియాలపై గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications