Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదో టీ20 టర్నింగ్ పాయింట్, సిక్స్ బౌండరీకి వెళ్లే బంతిని క్యాచ్: వైరల్ (వీడియో)

Jemimah Rodrigues' Dad 'Catches' Cape Town Action

హైదరాబాద్: సఫారీ పర్యటనలో భారత మహిళల జట్టు ఆడిన రెండు సిరీస్ లను కైవసం చేసుకుంది. పురుషుల జట్టు మూడు మ్యాచ్‌లలో రెండే సొంతం చేసుకోగా మహిళల జట్టే పైచేయి సాధించింది. మహిళా బౌలర్లు అద్వితీయ ప్రదర్శన చేసి మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకున్నారు.

కాగా, ఆఖరి టీ20 జట్టు విజయం సాధించాలని కసితో ఆడిన భారత్ ఫీల్డింగ్ లోనూ ఇరగదీసింది. సిక్స్ బౌండరీకి వెళ్లబోయే బంతిని ఎగిరి అందుకుని మ్యాచ్ మలుపు తిరగడానికి కారణమైంది బెమీమా.

జెమీమా స్టన్నింగ్ క్యాచ్.. మ్యాచ్‌లో మలుపు:
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బౌండరీ లైన్ వద్ద భారత క్రికెటర్ జెమీమా పట్టిన స్టన్నింగ్ క్యాచ్ మ్యాచ్‌లో హైలెట్. చివర్లో ధాటిగా ఆడుతున్న కాప్(27) మిడాన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర జెమీమా అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్న క్యాచ్‌తో కీలక వికెట్‌ను సౌతాఫ్రికా కోల్పోయింది. కాప్ నిష్క్రమణతో స్వల్పవ్యవధిలోనే సౌతాఫ్రికా మిగతా వికెట్లు కోల్పోవడంతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

ఆతిథ్య సౌతాఫ్రికా ఉమెన్స్, టీమిండియా ఉమెన్స్ జట్ల మధ్య శనివారం కేప్‌టౌన్‌లో ఐదో టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్‌కౌర్ నేతృత్వంలోని టీమిండియా 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఛేదనలో సౌతాఫ్రికా 18 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్(62) రాణించగా అత్యంత పిన్న వయస్కురాలు జెమీమా రోడ్రిగెజ్(44) చెలరేగి ఆడింది.

Story first published: Sunday, February 25, 2018, 15:10 [IST]
Other articles published on Feb 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+