నువ్వు చెప్పేవి అన్నీ అబద్దాలే.. దినేష్ కార్తీక్‌ను ఆటాడుకున్న జెమిమా రోడ్రిగ్స్!!

లండన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ద్వారా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్న డీకే.. అనంతరం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో కూడా అదరగొట్టాడు. వ్యాఖ్యానం చేయడం అదే మొదటిసారి అయినా.. ఎక్కడా తడబడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యాఖ్యాతగా అభిమానులను అలరించాడు. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ చేతిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. విషయంలోకి వెళితే...
వారు ఏం చెప్పినా వినకు:
టీమిండియా యువ క్రికెటర్ఎం అల్లరి పిల్ల జేమిమా రోడ్రిగ్స్ ప్రస్తుతం హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ టోర్నీలో ఆడుతోంది. నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. మంగళవారం జేమిమా రోడ్రిగ్స్ కామెంటేటర్ అవతారం ఎత్తింది. స్టార్ వ్యాఖ్యాతలు నాసిర్ హుస్సేన్, రాబ్ కీతో కలిసి ఆమె కామెంటరీ చేసింది. ఈ సందర్భంగా రోడ్రిగ్స్‌ను ఉద్దేశించి దినేశ్ కార్తీక్ ట్విటర్‌లో ఫన్నీగా ఓ కామెంట్ చేశాడు. 'ఇంగ్లీష్ కామెంటేటర్లు నాసిర్ హుస్సేన్, రాబ్ కీలు ఏం చెప్పినా అసలు వినకు. నీ స్టైల్లో కామెంటరీ చేయ్. దూసుకెళ్లు' పేరొన్నాడు.

నువ్ మాట్లాడేవి అవన్నీ అబద్దాలే:
దినేశ్ కార్తీక్ ట్వీట్‌పై జేమిమా రోడ్రిగ్స్ తనదైన శైలిలో బదులిచ్చింది. 'హహ్హహ.. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో వాళ్లు కూడా అదే చెప్పారు. నువ్వు చెప్పేది ఏది వినకూడదన్నారు. నువ్ మాట్లాడేవి అవన్నీ అబద్దాలే అని చెప్పారు' అంటూ రిప్లై ఇచ్చింది. లాఫింగ్ ఎమోజీలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జేమిమా రోడ్రిగ్స్ ట్వీట్‌పై లైకులు, కెమెంట్ల వర్షం కురుస్తోంది. టీమిండియా ఫాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'జేమిమా రోడ్రిగ్స్.. నువ్ సూపర్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బాగా చెప్పావ్' అని ఇంకొకరు కామెంట్ చేశారు. రోడ్రిగ్స్ భారత్ తరఫున 21 వన్డేలు, 47 టీ20లు ఆడింది.

హండ్రెడ్ 2021లో అదరగొడుతున్న జెమిమా:
వుమెన్స్ హండ్రెడ్ 2021 టోర్నీలో జెమిమా రోడ్రిగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. లండన్ స్పిరిట్, ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అర్థ శతకాలతో మెరిసింది. ఇక ఈ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక టీమిండియా తరపున 2018లో అరంగేట్రం చేసిన రోడ్రిగ్స్ 47 టీ20ల్లో 976 పరుగులు.. 21 వన్డేల్లో 394 పరుగులు చేసింది.

ప్రపంచకప్ మ్యాచే చివరిది:
ఇక దినేశ్ కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో డీకే చివరిసారి భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీ ఫైనల్లో విఫలమైన డీకే.. కేవలం 6 పరుగులు చేశాడు. దాంతో అప్పటి నుంచి డీకేను భారత్ తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం అతడు ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన చేస్తే.. అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులు యూఏఈ వేదికగా ఆరంభం కానున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications