'టీమిండియాలో పునరాగమనం చేయాలన్న ఆకలితో ఉన్నా.. ఈ కసి గతంలో ఎప్పుడూ లేదు'

రాజ్‌కోట్: టీమిండియాలో పునరాగమనం చేయాలన్న ఆకలితో ఉన్నా అని సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ అంటున్నాడు. ఆ కసి ఇప్పటి కన్నా ఎప్పుడూ ఎక్కువగా లేదు, అదే నన్ను రంజీ సీజన్‌లో ముందుకు నడిపించిందన్నాడు. 2019-20 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనున్న విషయం తెలిసిందే.

ఆకలితో ఉన్నా:
మ్యాచ్ అనంతరం సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కత్ మాట్లాడుతూ... 'భారత జట్టులో పునరాగమనం చేయాలన్న ఆకలితో ఉన్నా. ఆ కసి ఇప్పటి కన్నా ఎప్పుడూ ఎక్కువగా లేదు. అదే నన్నీ సీజన్‌లో ముందుకు నడిపించింది. ప్రతి మ్యాచులో సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తూ సీజన్ మొత్తం ఆడాలంటే శారీరకంగా ఫాస్ట్ బౌలర్‌కు చాలా కష్టం. అయితే నేను మాత్రం ఇలానే కొనసాగుతా. రంజీ ట్రోఫీ గెలివడంతో కెప్టెన్‌గా ఎంతో సంతోషంగా ఉన్నా' అని అన్నాడు.

ఐపీఎల్ నాకెంతో ముఖ్యం:
'ఐపీఎల్ నాకెంతో ముఖ్యం. ఫలితాలు రాబట్టేందుకు చాలామంది కన్నా నేనెక్కువగా శ్రమిస్తున్నా. అయితే ఐపీఎల్ ఒక్కటే నా మనసులో ఉండదు. వేలాలు జరుగుతుంటాయి. జనాలు మాట్లాడుతుంటారు. కానీ.. రంజీ ట్రోఫీ గెలవాలనే ఎంతో కోరుకున్నా. జట్టు, నా కోసం బాగా ఆడాలనుకున్నా. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ఎంతో ఇష్టం కాబట్టే క్రికెట్ ఆడుతున్నా' అని ఉనద్కత్ పేర్కొన్నాడు.

67 వికెట్లతో దుమ్మురేపాడు:
ప్రస్తుత రంజీ సీజన్లో ఉనద్కత్ బంతితో అద్భుతంగా రాణించాడు. 13.23 సగటుతో ఏకంగా 67 వికెట్లు తీశాడు. సెమీఫైనల్, ఫైనల్లో మ్యాచ్‌లను గెలిపించే ప్రదర్శనతో దుమ్మురేపాడు. బెంగాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన సౌరాష్ట్ర తొలి సారి రంజీట్రోఫీ విజేతగా అవతరించింది. టైటిల్ కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న సౌరాష్ట్రకు ఎట్టకేలకు ఉనద్కత్ నేతృత్వంలోని జట్టు ట్రోఫీని అందించింది. టైటిల్ గెలిచిన ఆనందంలో సౌరాష్ట్ర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

ఇంతకన్నా మంచి ప్రదర్శన ఉండదు:
జయదేవ్‌కు భారత ఆటగాడు చెతేశ్వర పుజారా అభినందనలు తెలిపాడు. 'జయదేవ్ ఈ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒకే సీజన్‌లో 67 వికెట్లు తీశాడంటే రంజీ ట్రోఫీలో ఇంతకన్నా మంచి ప్రదర్శన ఉండదు. భారత జట్టుకు ఎంపికవ్వాలంటే రంజీ ట్రోఫీకి ఎంతో ప్రాధాన్యముంది. అతడు భారత జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా' అని పుజారా అన్నాడు. జయదేవ్ చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌పై భారత జట్టు తరఫున ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications