మరోసారి అధిక ధరకి అమ్ముడుపోయిన జయదేవ్, ఏ జట్టుకి ఎంతకో తెలుసా..


జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ కోసం జరుగుతున్న వేలంలో సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనదఖ్త్ అరుదైన ఘనత సాధించాడు. వదిలేసిన జట్టే కొనుగోలు చేసింది.. అధిక ధర ఇస్తున్నామనుకుందో.. వదిలేసిన తర్వాత మళ్లీ కావాలనుకుందో కానీ, మిగిలిన ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. కనీసధర రూ. 1.5 కోటితో వేలంలోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్ కోసం రాజస్థాన్, ఢిల్లీ ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో జయదేవ్ ఉనాద్కత్ ధర రూ. 3.6 కోట్లకు చేరింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఎంటర్ కావడంతో జయదేవ్ ఉనద్కత్ ధర రూ. 6 కోట్లకు చేరుకుంది.
అనంతరం పంజాబ్ రేసులోకి రావడంతో అతడి ధర రూ. 7 కోట్లను తాకింది. జయదేవ్ ఉనాద్కత్ కోసం పంజాబ్, రాజస్థాన్ ప్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ రూ. 8.4 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. టీ20 స్పెషలిస్టుగా రాణిస్తున్న జయదేశ్ ఈ సీజన్‌లో ఏ మేర రాణిస్తాడో చూడాలి.

గతంలోనూ అత్యధిక ధరకే సొంతం
2018 సీజన్ వేలంలో కనీస ధర రూ. 1.50 కోట్లతో వేలంలోకి వచ్చాడు జయదేవ్ ఉనాదఖ్త్. అప్పుడు కూడా వేలంలో దూసుకుపోతూ 10 రెట్లు అధికంగా అమ్ముడుపోవడం విశేషం. అప్పటి వేలం ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను మాత్రమే రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇలా రాజస్థాన్ జట్టులో అధిక ధర దక్కించుకున్న ఆటగాళ్లలో జయదేవ్ రెండో స్థానంలో నిలిచాడు.

15 మ్యాచ్‌లాడి 11 వికెట్లు మాత్రమే
2018 సీజన్‌లో జయదేవ్ పేలవ ప్రదర్శనతో నిరూత్సాహపరిచాడు. అంతేకాదు 15 మ్యాచ్‌లాడి తీసిన వికెట్లు 11 మాత్రమే. దీంతో ఫ్రాంఛైజీ అతడిని విడుదల చేసిందని అందరూ భావించారు. రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ జుబిన్ బరాక్ మాట్లాడుతూ "ఐపీఎల్ 2018 సీజన్‌లో జయదేవ్ ప్రదర్శన గురించి చర్చించే సమయంలో.. అతను తాను అమ్ముడుపోయిన ధర గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. బౌలింగ్ సమయంలోఆ ఒత్తిడికి గురవడంతో అతని ప్రదర్శన దెబ్బతింది. అందుకే అతడిని జట్టు నుంచి విడిచిపెట్టడమే మంచిదని నిర్ణయించాం" అని చెప్పాడు.

అంచనాల్ని అందుకోలేకపోయి
ఐపీఎల్ 2017 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ఆడిన జయదేవ్ ఉనద్కత్ కేవలం 12 మ్యాచ్‌లాడి ఏకంగా 24 వికెట్లు తీశాడు. దీంతో 2018 సీజన్ వేలంలో జయదేవ్‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. వేలంలో సైతం పలు ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించేందుకు యత్నించాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 11.5 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది. అయితే, గత సీజన్‌లో అతడిపై పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications