For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత బౌలర్‌కు ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన పుజారా!!

Jaydev Unadkat announces engagement, Cheteshwar Pujara wishes teammate on finding love of his life

ముంబై: భారత పేస్ బౌలర్‌, సౌరాష్ట్ర రంజీ కెప్టెన్‌ జయదేవ్ ఉనద్కత్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం రినీతో ఉనద్కత్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. తన ఎంగేజ్‌మెంట్‌ రినీతో జరిగినట్టు ఉనద్కత్‌ సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కెప్టెన్‌గా సౌరాష్ట్రకు రంజీట్రోఫీ అందించిన ఆనందాన్ని నిశ్చితార్థంతో ఉనద్కత్‌ రెండింతలు చేసుకున్నాడు.

ఆరు గంటలు, రెండు భోజనాలు, ఓ కేక్‌:

జయదేవ్ ఉనద్కత్‌ తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 'ఆరు గంటలు, రెండు భోజనాలు, ఓ మడ్ కేక్‌.. తర్వాత ఎంగేజ్‌మెంట్‌' అని ఆ చిత్రాలకు ఉనద్కత్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. మరోవైపు రినీ కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోటోలను పంచుకుంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా హాజరయ్యాడు. పుజారా కూడా పోటీలను షేర్ చేస్తూ.. 'మా కుటుంబంలోకి వస్తున్న రినికి స్వాగతం. నా సోదరుడు చాలా సంతోషంగా ఉన్నాడు. తన జీవిత భాగస్వామి ప్రేమను కనుగొన్నాడు' అని రాసుకొచ్చాడు.

సౌరాష్ట్రకు రంజీ ట్రోఫీ అందించిన ఉనద్కత్‌

2019-20 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర, బెంగాల్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ గత శుక్రవారం డ్రాగా ముగిసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనున్న విషయం తెలిసిందే. టైటిల్‌ కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న సౌరాష్ట్రకు ఎట్టకేలకు ఉనద్కత్‌ నేతృత్వంలోని జట్టు ట్రోఫీని అందించింది.

67 వికెట్లతో అద్భుత ప్రదర్శన:

67 వికెట్లతో అద్భుత ప్రదర్శన:

2019-20 రంజీ సీజన్‌లో జయదేవ్ ఉనద్కత్‌ బంతితో అద్భుతంగా రాణించాడు. 13.23 సగటుతో ఏకంగా 67 వికెట్లు తీశాడు. సెమీఫైనల్‌, ఫైనల్లో మ్యాచ్‌లను గెలిపించే ప్రదర్శనతో దుమ్మురేపాడు. టోర్నీ చరిత్రలో ఈ తరహాలో ఏ ఫాస్ట్ బౌలర్ రాణించలేదని గణాంకాలు చెపుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం జయదేవ్‌కు పుజారా అభినందనలు తెలిపాడు. రంజీ సీజన్‌లో అద్భుతంగా రాణించిన ఉనద్కత్‌ని భారత జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్టర్లకు సూచించాడు.

ఆకలితో ఉన్నా:

ఆకలితో ఉన్నా:

మ్యాచ్ అనంతరం సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కత్‌ మాట్లాడుతూ... 'భారత జట్టులో పునరాగమనం చేయాలన్న ఆకలితో ఉన్నా. ఆ కసి ఇప్పటి కన్నా ఎప్పుడూ ఎక్కువగా లేదు. అదే నన్నీ సీజన్‌లో ముందుకు నడిపించింది. ప్రతి మ్యాచులో సుదీర్ఘంగా బౌలింగ్‌ చేస్తూ సీజన్‌ మొత్తం ఆడాలంటే శారీరకంగా ఫాస్ట్‌ బౌలర్‌కు చాలా కష్టం. అయితే నేను మాత్రం ఇలానే కొనసాగుతా. రంజీ ట్రోఫీ గెలివడంతో కెప్టెన్‌గా ఎంతో సంతోషంగా ఉన్నా' అని అన్నాడు.

Story first published: Monday, March 16, 2020, 11:31 [IST]
Other articles published on Mar 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+