Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సుంద‌ర్ ప్లేసులో యాద‌వ్.. సౌతాఫ్రికా విమానం ఎక్కిన భార‌త వ‌న్డే జ‌ట్టు

Jayant Yadav Replaces Washington Sundar For ODI Series

ఆ నెల 19 నుంచి స‌ఫారీల‌తో ప్రారంభంకానున్న వ‌న్డే సిరీస్ కోసం భార‌త వ‌న్డే జ‌ట్టు సౌతాఫ్రికా బ‌య‌ల్దేరింది. మొత్తంలో 18 మందితో కూడిన భార‌త జ‌ట్టును సెలెక్ట‌ర్లు సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్ కోసం ఎంపిక చేశారు. ఇందులో ప్ర‌స్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న ఆట‌గాళ్లు కూడా చాలానే ఉన్నారు. దీంతో ఇండియాలో ఉన్నవారు సౌతాఫ్రికా బ‌య‌లుదేరు. అయితే క‌రోనా బారిన ప‌డ్డ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ మాత్రం సౌతాఫ్రికా వెళ్ల‌డం లేదు. ప్ర‌స్తుతం వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఐసోలేష‌న్‌లో కోలుకుంటున్నాడు. అత‌ని స్థానంలో స్పిన్న‌ర్ జ‌యంత్ యాద‌వ్‌ను మెనేజ్‌మెంట్ జ‌ట్టులోకి తీసుకుంది.

సౌతాప్రికాతాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన జ‌యంత్ యాద‌వ్ ప్ర‌స్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. ఈ రోజు సౌతాఫ్రికా విమానం ఎక్కిన వారిలో శిఖ‌ర్ ధావ‌న్, సూర్య‌కుమార్ యాద‌వ్, ఇషాన్ కిష‌న్, వెంక‌టేశ్ అయ్య‌ర్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, చాహ‌ల్, దీప‌క్ చాహ‌ర్, ప్ర‌సిద్ధ్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. వీరితో ప‌లువురు టీమ్ స‌హాయ‌క బృందంలోని స‌భ్యులు కూడా సౌతాఫ్రికా వెళ్లారు. కాగా భార‌త్, సౌతాఫ్రికా మ‌ధ్య ఈ నెల 19న తొలి వ‌న్డే, 21న రెండో వ‌న్డే, 23న మూడో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌కు ఎంపికైన భార‌త జ‌ట్టు:
కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), య‌జుర్వేంద్ర‌ చాహల్, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, జ‌యంత్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్.

IND Vs SA : Team India Missed Virat Kohli - Wasim Jaffer | Oneindia Telugu

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్ మాత్రం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను ఇండియా, సౌతాఫ్రికా చెరోటి గెల‌వ‌డంతో ప్ర‌స్తుతం కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ సిరీస్ ఫ‌లితాన్ని తేల్చ‌నుంది. కాగా తొలి రోజు ఆట‌లో భార‌త జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. అయితే కెప్టెన్ కోహ్లీ మిన‌హా మిగ‌తా వారెవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో భారీ స్కోర్ చేయ‌లేక‌పోయింది. స‌ఫారీ పేస‌ర్ల ధాటికి 223 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి సౌతాఫ్రికా ఒక వికెట్ న‌ష్ట‌పోయి 17 ప‌రుగులు చేసింది.

Story first published: Wednesday, January 12, 2022, 14:05 [IST]
Other articles published on Jan 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+