Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క ఎత్తుగడతో పాకిస్థాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టిన జైషా!

PSL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాలలో క్రీడలు కూడా ప్రభావితమయ్యాయి. ఇరు దేశాల మధ్య వివాదం కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2025ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు పీఎస్ఎల్ 2025 టోర్నమెంట్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదాకు కారణం ఐసీసీ ఛైర్మన్, మాజీ బీసీసీఐ కార్యదర్శి జై షా అని వార్తలు వస్తున్నాయి.

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ లీగ్‌ను దుబాయ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కానీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ECB) దానికి అంగీకరించపోవడంతో పీసీబీ అలా చేయలేకపోయింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోని మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడానికి పీసీబీకి అనుమతి నిరాకరించడంలో జై షా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.

Jay shah s Strategic Move Severely Impacts Pakistan Super League 2025

క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. జైషా, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మధ్య ఉన్న మంచి సంబంధాలు పాకిస్థాన్ సూపర్ లీగ్ సస్పెన్షన్‌లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ క్రికెట్ అధికారి మాట్లాడుతూ.. సరిహద్దులో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మేము మౌనంగా ఉండలేమని అన్నారు.

ఐపీఎల్ కూడా వారం పాటు వాయిదా
ప్రస్తుతం వివాదం కారణంగా పీఎస్ఎల్ మాత్రమే కాదు ఐపీఎల్ కూడా వారం పాటు వాయిదా పడింది. ధర్మశాల స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగానే.. ఉద్రిక్తతలు పెరగడంతో మ్యాచ్ మధ్యలో రద్దు చేయబడింది. దీని తర్వాత ఆటగాళ్లను మరుసటి రోజు రైలులో సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. టోర్నమెంట్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. విదేశీ ఆటగాళ్లు ఇప్పుడు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని చూస్తున్నారు.

Story first published: Sunday, May 11, 2025, 9:42 [IST]
Other articles published on May 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+