For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జై షా జర్నీ: గుజరాత్ బోర్డు నుంచి ఐసీసీ ఛైర్మన్ వరకు!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న ఆయన డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ ప్రపంచ క్రికెట్ అత్యున్నత పదవికి ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా 35 ఏళ్ల జై షా చరిత్ర సృష్టించాడు.

ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైన అయిదో భారతీయుడిగా జైషా నిలిచాడు. జగన్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్‌ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే సాధారణ స్థానం నుంచి తన కెరీర్ మొదలుపెట్టిన జై షా అద్భుత రీతిలో ఎదిగి, తక్కువ కాలంలోనే ఐసీసీ ఛైర్మన్‌గా ఏక్రీగ్రవంగా ఎన్నికయ్యాడు. జై షా కెరీర్ సాగిందిలా..

Jay Shah s Rise From GCA to ICC Chairman The Making of Cricket s Most Powerful Leader

2009లో జై షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో అడుగుపెట్టాడు. మొదట సెంట్రల్ బోర్డు ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్‌లో పనిచేశాడు. క్రమంగా గుజరాత్ క్రికెట్ అసోషియేషన్‌లో స్టేట్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. 2011లో బీసీసీఐకి మార్కెటింగ్ కమిటీలో పనిచేశాడు. అనంతరం 2013లో గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీగా ఎదిగాడు. బీసీసీఐ వార్షిక సమావేశాల్లో గుజరాత్ బోర్డు తరఫున పాల్గొన్నాడు.

2015లో బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీలో బాధ్యతలు అందుకున్న జైషా నాలుగేళ్ల పాటు పనిచేశాడు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడి శ్రీనివాసన్ హయంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందాడు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన సమయంలో జై షా సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడు. 2022లో బీసీసీఐ కార్యదర్శి స్థానానికి మరోసారి ఎన్నికయ్యాడు. మరోవైపు 2022లో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌‌కు జైషా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఐసీసీ ఫైనాన్స్ & కమర్షియల్ ఎఫైర్స్ కమిటీకి ఛైర్మన్‌గానూ ఎంపికయ్యాడు. తాజాగా గ్రెగ్ బార్‌క్లే స్థానంలో ఐసీసీ నూతన ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు అందుకున్నాడు.

Story first published: Wednesday, August 28, 2024, 12:16 [IST]
Other articles published on Aug 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+