ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం చాలా రోజుల క్రితం నుంచే ఫ్యాన్స్ అందరూ అహ్మదాబాద్‌లో హోటల్స్ కూడా బుక్ చేసుకున్నారు. అవి దొరకని వాళ్లు హాస్పిటల్స్‌లో బెడ్స్ కూడా బుక్ చేసుకొని మ్యాచ్ టైంకి అక్కడకు చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇలాంటి టైంలో నవరాత్రి ఉత్సవాల కారణంగా మ్యాచ్ షెడ్యూల్ మారొచ్చంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. సడెన్‌గా ఇప్పుడు సడెన్‌గా వేదికలు మార్చేస్తే తమ షెడ్యూల్ అంతా గందరగోళంగా తయారవుతుందని వాళ్లు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక ప్రకటన చేశాడు.

కొన్ని రోజుల క్రితం ఐసీసీ, బీసీసీఐ విడుదల చేసిన వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకుంటాయని జై షా స్పష్టం చేశాడు. అయితే షెడ్యూల్‌లో ఇచ్చిన వేదికలు మారడం జరగదని, కానీ తేదీలు మారే అవకాశం ఉందని తేల్చిచెప్పాడు. అయితే స్పెసిఫిక్‌గా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అహ్మదాబాద్‌లో అక్టోబరు 15న నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడా ఉండటంతో ఈ మ్యాచ్‌కు పోలీసులు భద్రత కల్పించలేరని రిపోర్టులు వచ్చాయి. అలాంటి సమయంలో ఇంత పెద్ద మ్యాచ్‌కు భద్రత ఇవ్వడం కష్టమని సెక్యూరిటీ దళాలు స్పష్టం చేశాయట.
దీంతో ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే వేదిక మారడం మాత్రం జరగదని జై షా స్పష్టం చేశాడు. 'రెండు, మూడు మెంబర్ బోర్డుల అభ్యర్థన మేరకు కొన్ని మ్యాచుల తేదీలు మారే అవకాశం ఉంది. అయితే ప్రత్యేకంగా ఇది భారత్, పాక్ మ్యాచ్‌కు సంబంధించిన అంశం మాత్రం కాదు' అని జై షా తెలిపాడు.