మియాందాద్‌కు అనురాగ్ ఠాకూర్ అదిరిపోయే కౌంటర్
ముంబై: భారత్‌పై యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. పాత జ్ఞాపకాల నుంచి మియాందాద్ ఇంకా తేరుకోలేదని అనురాగ్ కాస్తంత ఘాటుగానే స్పందించారు.

భారతపై యుద్ధానికి వస్తే మరోసారి పాకిస్తాన్‌కు చావుదెబ్బ తప్పదని విమర్శించారు. అది క్రికెట్ ఫీల్డ్ అయినా, యుద్ధ భూమిలో అయినా పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయిన అని అదే చాలాసార్లు రుజువైందని ఆయన గుర్తుచేశారు. ఇంకా గుర్తు రాకపోతే ఓసారి చరిత్రను తిరగేయాలని ఆయన సూచించారు.
'మాపై పాకిస్తాన్ ఎదుర్కొన్న ఓటముల నుంచి మియాందాద్ ఇంకా కోలుకున్నట్లు లేడు. ఒకవేళ మియాందాద్‌కు అతని దేశానికి చెందిన ప్రజలపై నమ్మకంగా ఉంటే, దావూద్‌ను భారత్‌కు వెళ్లమని చెప్పాలి. అది ఎందుకు చేయడంలేదు. ఇప్పటివరకూ పాకిస్తాన్‌పై మాదే పైచేయి. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది' అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications