Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో క్రికెట్ ఆడటం గురించి మర్చిపోండి: జావేద్ మియాందాద్

Javed Miandad Asks Pakistan Cricket Board To Forget About Playing India

హైదరాబాద్: భారత్‌తో క్రికెట్ ఆడటం గురించి మర్చిపోండి. దానికి బదులుగా స్వదేశ ఆటపై దృష్టి పెడితే మనమే ఇంకాస్త మెరుగయ్యేందుకు అవకాశాలున్నాయి. అంటున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్. ఇంకా ఆయన మాట్లాడుతూ 'భారతదేశం ఇప్పట్లో లేదా భవిష్యత్‌లో కానీ పాకిస్థాన్‌తో ఆడేందుకు సుముఖుత చూపించట్లేదు. దానికోసం ప్రతి సారి పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ భారత్ ను అడుక్కోవాల్సిన అవసర్లేదని' నొక్కి చెప్తున్నాడు.

పది సంవత్సరాల నుంచి భారత్ మనతో ఆడట్లేదు. అయితే మాత్రం ఏంటి.? మన ఆట స్థాయి ఏమైనా తగ్గిపోయిందా..? లేదే. దీనికి మనం గెలుచుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఒక ఉదాహరణ.

భారత్, పాక్‌ల మధ్య రాజకీయ ఒత్తిడుల కారణంగా కొన్ని 2012 నుంచి ఆడటం లేదు. దాదాపు 2008 లో జరిగిన ముంబై టెర్రర్ దాడుల తర్వాత నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పీసిబి ఆర్థికంగా బాగానే ఉంది. ఐసీసీ ద్వారా వచ్చిన నిధులను సరిగ్గానే సమకూర్చుకుంటుంది. అని తేల్చి చెప్పేశాడు.

భారత్ 2019 ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీకి సిద్ధం అంటే ఇప్పటికే ఆరుగురు ప్రత్యర్థి దేశాల పేర్లను విడుదల చేసింది. అయితే వాటిలో పాకి్స్థాన్ పేరు లేనేలేదు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 5, 2018, 17:02 [IST]
Other articles published on Jan 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+