వావ్.. సింప్లిసిటీ అంటే ఇదే! మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా టీమిండియా లెజెండ్!
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లలో ఒకరైన జవగల్ శ్రీనాథ్ ఇటీవల బెంగళూరులోని 'నమ్మ మెట్రో'లో ప్రయాణిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి వీఐపీ ప్రోటోకాల్స్, హంగామా లేకుండా ఓ సాధారణ ప్రయాణీకుడిలా ఆయన మెట్రో రైలు కోచ్‌లో నిలబడి ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో అభిమానులు, క్రీడాభిమానులు ఆయన నిరాడంబరతను చూసి ముగ్ధులవుతున్నారు.
సాధారణ జీవనశైలితో ఆకట్టుకున్న దిగ్గజ పేసర్
బ్లూ జీన్స్, నీలం రంగు షర్ట్ ధరించి చేతిలో ఓ చిన్న ట్రాలీ బ్యాగ్‌తో ప్రశాంతంగా చూడ్డానికి ఓ ఐటీ ఎంప్లాయ్ లాగా దర్శనం ఇచ్చారు జవగల్ శ్రీనాథ్. 90వ దశకంలో తన భయంకరమైన పేస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ బ్యాటర్లను వణికించిన ఈ స్టార్ క్రికెటర్ నేడు సామాన్య ప్రజల మధ్య ఇంత నిరాడంబరంగా సంచరించడం నిజంగా అరుదైన విషయమని అభిమానులు కొనియాడుతున్నారు.

శ్రీనాథ్ అద్భుతమైన క్రికెట్ కెరీర్
'మైసూర్ ఎక్స్‌ప్రెస్'గా క్రికెట్ ప్రపంచంలో పేరుగాంచిన జవగల్ శ్రీనాథ్.. భారత ఫాస్ట్ బౌలింగ్ రంగానికి బలమైన పునాది వేసిన ఆటగాడు. జవగల్ శ్రీనాథ్ భారత్ తరఫున 67 టెస్ట్ మ్యాచ్‌లలో 236 వికెట్లు, 229 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లలో 315 వికెట్లు పడగొట్టారు. వన్డే క్రికెట్లో 300 కంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఏకైక భారత పేసర్‌గా ఆయన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ.. ఐసీసీ మ్యాచ్ రెఫరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే తన వినయ విధేయతలను కాపాడుకుంటున్నారు.
కర్ణాటక స్టార్ల ప్రత్యేక శైలిపై ప్రశంసల వర్షం
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జవగల్ శ్రీనాథ్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అపారమైన క్రీడా క్రీర్తి, హోదా ఉన్నప్పటికీ ఆడంబరాలకు దూరంగా ఉండటం శ్రీనాథ్ కు అలవాటని కొనియాడారు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథ్ వంటి కర్ణాటక క్రికెట్ దిగ్గజాల శైలి ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటుందని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గొప్ప స్థానాల్లో ఉన్నప్పటికీ వినయం వీడని శ్రీనాథ్ నిజమైన రోల్ మోడల్ అని కామెంట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

