Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ ర్యాంకులు: మళ్లీ అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీ, బుమ్రా

Jasprit Bumrah, Virat Kohli keep their top slot in ICC ODI rankings

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాలు వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 884 పాయింట్లతో బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 797 పాయింట్లతో బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్‌ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకోగా, శిఖర్‌ ధావన్‌ 802 రేటింగ్‌ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో ఆప్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 353 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

జట్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ అగ్రస్థానం

జట్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ అగ్రస్థానం

ఇక, జట్టు ర్యాంకింగ్స్‌లో 127 పాయింట్లతో ఇంగ్లాండ్ టీమ్ అగ్రస్థానంలో నిలవగా, టీమిండియా 122 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్(112 పాయింట్లు), దక్షిణాఫ్రికా(110 పాయింట్లు)లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

 జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన రోహిత్, ధావన్‌

జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన రోహిత్, ధావన్‌

ఇటీవల దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్‌‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు సెంచరీలు సాధించి భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మకి రెండో స్థానం దక్కగా.. శిఖర్ ధావన్‌ ఐదో స్థానంలో నిలిచాడు.

 700 పాయింట్లతో కుల్దీప్ మూడో స్థానంలో

700 పాయింట్లతో కుల్దీప్ మూడో స్థానంలో

ఇక, బౌలర్ల జాబితాలో బుమ్రా తర్వాత కుల్దీప్ యాదవ్‌కి మాత్రమే భారత్ తరఫున టాప్-5లో చోటు దక్కింది. 700 పాయింట్లతో కుల్దీప్ మూడో స్థానంలో నిలిచాడు. వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

రెండో టీమిండియా బౌలర్‌గా రికార్డు

రెండో టీమిండియా బౌలర్‌గా రికార్డు

దీంతో మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు భువనేశ్వర్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. మరొకవైపు మూడు ఫార్మాట్స్‌లో ఐదేసి వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు కుల్దీప్ యాదవ్.

Story first published: Monday, October 8, 2018, 17:27 [IST]
Other articles published on Oct 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+