Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరిన బుమ్రా.. !

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన తాత్కాలిక కెప్టెన్ కమ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. బౌలర్ ర్యాంకింగ్ లో జస్ప్రీత్ బుమ్రా తర్వాత దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా రెండో స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా సీమర్ జోష్ హేజిల్‌వుడ్‌ మూడో స్థానంలో కొనసాగుతోన్నాడు. మరో భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రవింద్ర జడేజా ఏడో స్థానంలో కొనసాగుతోన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై తొమ్మిది వికెట్లు తీసిన తర్వాత బుమ్రా తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత రబడా మొదటి స్థానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగి మ్యాచ్ లో రాణించడంతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మహ్మద్ సిరాజ్ కూడా టెస్ట్ బౌలర్‌ల జాబితాలో మూడు స్థానాలు మెరుగుపడి 25వ స్థానానికి చేరుకున్నాడు.

Jasprit Bumrah tops in ICC Test bowler rankings

వెస్టిండీస్ పేసర్ల త్రయం పెరుగుతోంది. జేడెన్ సీల్స్, కెమర్ రోచ్, అల్జారీ జోసెఫ్ వారి ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. వెస్టిండీస్ విజయంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు కలిసి 14 వికెట్లు పడగొట్టగా, బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి 16 స్థానాలు ఎగబాకి 51వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ ఇప్పటికీ టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ తర్వాత భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఇప్పుడు అతని సమీపంగా వచ్చాడు.

జైస్వాల్ 161 పరుగుల మెరుపు సెంచరీతో మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చడంలో సహాయం చేశాడు. ఫలితంగా టెస్ట్ బ్యాటర్‌ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో రూట్ కంటే 825, 78 రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. పెర్త్‌లో 89 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండర్ ట్రావిస్ హెడ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ తన 30వ టెస్టు సెంచరీ తర్వాత 9 స్థానాలను మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచాడు.

Story first published: Wednesday, November 27, 2024, 16:24 [IST]
Other articles published on Nov 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+