Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రాకు బీసీసీఐ అత్యున్నత పురస్కారం.. శ్రీకాంత్‌కు 'లైఫ్‌ టైమ్‌'అవార్డు!!

Naman Awards : Jasprit Bumrah, Smriti Mandhana, Jhulan Goswami Claim Top BCCI Awards || Oneindia
Jasprit Bumrah to receive Polly Umrigar award for best Indian international cricketer

ముంబై: టీమిండియా ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను భారత క్రికెట్‌ నియంత్రణా మండలి (బీసీసీఐ) అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. 2018-19 సీజన్‌లో అద్భుత ప్రదర్శనకుగాను బీసీసీఐ ఆదివారం అతడికి ఈ అవార్డు బహుకరించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బుమ్రా.. ఈ సీజన్‌లో టెస్టుల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో పురుషుల విభాగంలో ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత పురస్కారం అతడికి దక్కింది.

బుమ్రాకు ఉమ్రిగర్‌ అవార్డు

బుమ్రాకు ఉమ్రిగర్‌ అవార్డు

ఆదివారం రాత్రి ముంబైలో నిర్వహించిన 2018-2019 వార్షికోత్సవంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించినందుకు బుమ్రాకు పాలీ ఉమ్రిగర్‌ అవార్డును బహుకరించింది. ఈ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతి అందించారు. దీంతో పాటు దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు కూడా అతడిని వరించింది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఈ పురస్కారాన్ని ఇస్తారు. 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా.. ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్‌ చేజిక్కించుకున్నాడు.

పూనమ్‌కు బీసీసీఐ అత్యున్నత పురస్కారం

పూనమ్‌కు బీసీసీఐ అత్యున్నత పురస్కారం

మహిళల విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ పురస్కారం గెల్చుకుంది. దేశ అత్యున్నత క్రికెట్‌ పురస్కారం కూడా ఆమెనే వరించింది. గత సీజన్‌లో పూనమ్‌ భారత్‌ తరఫున 8 వన్డేల్లో 14 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసింది.

అగర్వాల్‌కు ఉత్తమ అరంగేట్రం అవార్డు

అగర్వాల్‌కు ఉత్తమ అరంగేట్రం అవార్డు

టెస్టుల్లో అత్యధిక పరుగులు (677) చేసిన చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ కేటగిరీలో దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు పొందాడు. ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్‌ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌కు ఉత్తమ అరంగేట్రం క్రికెటర్‌ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 2 లక్షలు దక్కాయి. మహిళా క్రికెట్‌లో షెఫాలీ వర్మ ఈ అవార్డు దక్కించుకుంది.

శ్రీకాంత్‌కు 'లైఫ్‌ టైమ్‌'అవార్డు

శ్రీకాంత్‌కు 'లైఫ్‌ టైమ్‌'అవార్డు

దేశవాళీ క్రికెట్‌ టోర్నీలలో విశేషంగా రాణించిన విదర్భ జట్టుకు బీసీసీఐ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు లభించింది. మహిళా జట్టులో స్మృతి మంధాన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. ఝూలన్‌ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌, మహిళా క్రికెటర్‌ అన్జుమ్‌ చోప్రాలను కోల్‌ సీకే నాయుడు జీవితకాల పురస్కారంతో సత్కరించారు. ఇద్దరికీ ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షల చెక్‌ ప్రదానం చేశారు.

Story first published: Monday, January 13, 2020, 9:05 [IST]
Other articles published on Jan 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+