
త్వరలోనే మైదానంలోకి:
వెడ్డింగ్ బ్రేక్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఈనెల ఆఖరులో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. పెళ్లి కోసమే ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్, టీ20, వన్డే సిరీస్‌లకు బుమ్రా సెలవులు తీసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ఆరంభంకాబోతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో బుమ్రా చేరనున్నాడు. మార్చి 26-28 మధ్య ముంబై జట్టుతో అతడు కలుస్తాడని సమాచారం. అదే రోజు నుంచి వారం రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉంటాడు. ఆ తర్వాత జట్టుతో కలిసి చెన్నై బయలుదేరి వెళ్లనున్నాడు.

వన్డే సిరీస్‌కు అనుమానమే:
ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరగాల్సిన వన్డే సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండేది సందేహంగా మారింది. ఈరోజు భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుండగా.. శనివారం చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆపై 23న తొలి వన్డే, 26న రెండో వన్డే, 28న చివరి వన్డే జరగనున్నాయి. పెళ్లి అనంతరం బిజీగా ఉన్న బుమ్రా.. మ్యాచులు ఆడాలంటే వారం రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాలి. ఆ లోపు వన్డే సిరీస్ పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తానికి బుమ్రాను మళ్లీ ఐపీఎల్ 2021లో చూస్తాం.

ఎన్ని వార్తలొచ్చినా :
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. బుమ్రా పెళ్లాడేది అనుపమ పరమేశ్వరన్ అంటూ ఎన్ని వార్తలొచ్చినా అతడు మౌనంగానే ఉన్నాడు. తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు. చివరికి సోమవారం సంజనతో ఒక్కటైన ఫొటోలను స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని అందరికి షాక్ ఇచ్చాడు.

పెళ్లికి ఇదే తగిన సమయం:
ఇంగ్లండ్‌తో ఇంకా టీ20, వన్డే సిరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2021 ఉంది. ఏప్రిల్ 9 నుంచి మార్చి 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కీలక బౌలర్. ఆ వెంటనే జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఇక అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఖాళీ సమయమే లేదు. అందుకే పెళ్లికి ఇదే తగిన సమయం అని బుమ్రా భావించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












