Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shoaib Akhtar: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah to be Team Indias future captain: Shoaib Akhtar

ఇటీవ‌ల విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంతో టీమిండియాలో ఆ బాధ్య‌త ఎవ‌రికి అప్ప‌గించాల‌ని చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో మాజీ క్రికెట‌ర్లు ప‌లువురు ఆట‌గాళ్ల పేర్ల‌ను సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్సీపై పాకిస్థాన్ పేస్ దిగ్గ‌జం షోయ‌బ్ అక్త‌ర్ స్పందించాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎవ‌రైతే బాగుంటుంద‌నే విష‌యమై త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు.

అత‌డే భ‌విష్య‌త్ కెప్టెన్‌

అత‌డే భ‌విష్య‌త్ కెప్టెన్‌

పేస్ గ‌న్ జ‌స్ప్రీత్ బుమ్రాను టీమిండియా భ‌విష్య‌త్ టెస్టు కెప్టెన్‌గా తీర్చిదిద్దాల‌ని పాకిస్థాన్ లెజెండ్ షోయ‌బ్ అక్త‌ర్ సూచించాడు. ప్ర‌స్తుతం అత‌డిని భార‌త జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియ‌మించాల‌ని సూచించాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ప్ర‌త్యామ్నాయాన్ని బీసీసీఐ ప్ర‌స్తుతం వెతుకుతుంద‌ని, ఈ క్ర‌మంలో కెప్టెన్‌గా పేస్ బౌల‌ర్ల‌ను కూడా భార‌త జ‌ట్టు సెలెక్ట‌ర్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ఆయ‌న సూచించాడు.

పేస‌ర్ల‌ను ఎందుకు తీసుకోరు

పేస‌ర్ల‌ను ఎందుకు తీసుకోరు

"కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్లను ఎందుకు తీసుకోరు. కపిల్ దేవ్ ఒక ఫాస్ట్ బౌలరే క‌దా.. అత‌ను టీమిండియాకు ఎన్నో విజ‌యాలు అందించాడు. అతను గొప్ప కెప్టెన్ కాదా? బ్యాటర్లు, బౌల‌ర్ల‌ కంటే తెలివైనవారనే భావన ఎందుకు ఉందో నాకు తెలియదు. పాకిస్థాన్‌కు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి పేస్ బౌల‌ర్లు కెప్టెన్లుగా ఉన్నారు" అని షోయబ్ అక్త‌ర్ ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించాడు.

ఈ ధోర‌ణి త‌ప్పు

ఈ ధోర‌ణి త‌ప్పు

"ఒక ఫాస్ట్ బౌలర్ ఎప్పుడూ జ‌ట్టు విజయం కోస‌మే ప్ర‌య‌త్నిస్తాడు. బ్యాటర్లు అలా చేయరని నేను చెప్పడం లేదు. కానీ అది కొంచెం భిన్నంగా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రాను ప్ర‌స్తుతం వైస్ కెప్టెన్‌గా చేసి భ‌విష్య‌త్‌ కెప్టెన్‌గా తీర్చిదిద్దాలి. ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్‌లకు కూడా కెప్టెన్సీ అప్ప‌గించాలి. బ్యాటర్లు మాత్రమే కెప్టెన్‌గా ఉండ‌గ‌ల‌ర‌నే ఈ ధోరణి తప్పు" అని షోయబ్ అక్త‌ర్ అన్నారు. కాగా ప్ర‌స్తుతం షోయ‌బ్ అక్త‌ర్ వ్యాఖ్య‌లు చ‌ర్చనీయాంశంగా మారాయి.

కెప్టెన్సీకి నేను రెడీ

కెప్టెన్సీకి నేను రెడీ

విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్‌గా త‌ప్పుకున్న త‌ర్వాత టీమిండియా త‌దుప‌రి కెప్టెన్ ఎవ‌ర‌నే చ‌ర్చ నడుస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల టీమిండియా పేస్ గ‌న్ జ‌స్ప్రీత్ బుమ్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టడానికి తాను రెడీగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. అవ‌కాశం ఇస్తే కెప్టెన్సీ ఒక గౌర‌వంగా భావిస్తాన‌ని తెలిపాడు. జ‌ట్టు కోసం త‌న సామార్థ్యం మేర‌కు క‌ష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చాడు. బుమ్రా ప్ర‌స్తుతం సౌతాఫ్రికాతో జ‌ర‌గుతున్న వ‌న్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా ఇటీవ‌ల సౌతాఫ్రికా గ‌డ్డ‌పై టీమిండియా టెస్ట్ సిరీస్ ఓడిన త‌ర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా త‌దుప‌రి టెస్ట్ కెప్టెన్ ఎవ‌ర‌నే చ‌ర్చ అంత‌టా న‌డుస్తోంది.

Story first published: Sunday, January 23, 2022, 14:35 [IST]
Other articles published on Jan 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+