హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని తన దృష్టిని పూర్తిగా బ్యాటింగ్‌పైనే సారించినట్లు కనిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే సిరిస్‌లో భాగంగా కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ధోని చెలరేగి ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చూపించాడు.
122 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో ధోని 134 పరుగులు సాధించాడు. గొప్ప ఫినిషర్‌గా పేరొందిన ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత తిరిగి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరిస్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు సంధించే యార్కర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ఇందులో భాగంగా టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుుమ్రా బౌలింగ్‌లో ధోని బుధవారం యార్కర్లను ప్రాక్టీస్ చేశాడు.
ధోని బుమ్రా బౌలింగ్‌లో యార్కర్లను ఏ విధంగా ప్రాక్టీస్ చేశాడో అందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో బుమ్రా యార్కర్లు సంధిస్తుంటే వాటిని ధోని తన ట్రేడ్ మార్కు షాట్లతో బౌండరీలకు తరలించాడు.