Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధానకు అరుదైన గౌరవం

Jasprit Bumrah, Smriti Mandhana Win Wisden India Almanack Cricketer Of The Year Award || Oneindia
Jasprit Bumrah, Smriti Mandhana win Wisden India Almanack Cricketer of the Year award

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌ ఉమన్‌ స్మృతి మంధాన ప్రతిష్టాత్మక విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. శుక్రవారం మొత్తం ఐదుగురికి పురస్కారాలు ప్రకటించగా అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు.

వీరితో పాటు ఫకార్‌ జమాన్‌ (పాకిస్థాన్), దిముత్ కరుణరత్నె (శ్రీలంక), రషీద్‌ ఖాన్‌ (ఆప్ఘనిస్థాన్)లకు సైతం పురస్కారాలు వరించాయి. ఇక, టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. 2019, 2020 సంవత్సరానికి గాను విజ్డన్ పత్రిక ఏడో ఎడిషన్‌ వార్షిక సంచికల్లో మయాంక్ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించింది.

ఈ ఏడాది ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన యమాంక్ అగర్వాల్ దక్షిణాఫ్రికాతో విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా సఫారీలను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.

మరోవైపు భారత్‌ నుంచి విజ్డెన్‌ పురస్కారానికి ఎంపికైన భారత మూడో మహిళా క్రికెటర్‌‍‌గా స్మృతి మందాన అరుదైన ఘతన సాధించింది. అంతకముందు మిథాలీరాజ్‌, దీప్తి శర్మ ఈ ఘనత సాధించారు. భారత క్రికెట్ క్రికెటర్లు గుండప్ప విశ్వనాథ్‌, లాలా అమర్‌నాథ్‌ విజ్డెన్‌ ఇండియా హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.

Story first published: Friday, October 25, 2019, 18:46 [IST]
Other articles published on Oct 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+