బుమ్రా, ధావన్‌లకు చోటు: శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరిస్‌లకు భారత జట్టు ఎంపిక

హైదరాబాద్: శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్‌కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే మూడు టీ20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌కు భారత జట్లను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది.
వచ్చే ఏడాదిని టీమిండియా శ్రీలంక జట్టుతో జరగనున్న టీ20 సిరిస్‌తో ప్రారంభించనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్‌లో తలపడనుంది. శ్రీలంక సిరిస్ జనవరి 5 నుంచి 10 వరకు జరగనుండగా... ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్ జనవరి 14 నుంచి 19 వరకు జరుగుతుంది.

జనవరి 5న గౌహతి వేదికగా తొలి టీ20
తొలి టీ20 జనవరి 5న గౌహతి వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 7వ తేదీన ఇండోర్, 10వ తేదీన పూణె వేదికగా జరగనుంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ నుంచి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పేసర్ మహ్మద్ షమీకి సెలక్టలు విశ్రాంతినిచ్చారు. 2019 వరల్డ్‌కప్ నుంచి రోహిత్ శర్మ టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు.

రోహిత్ స్థానంలో శిఖర్ ధావన్
దక్షిణాఫ్రితాతో టెస్టు సిరిస్ సందర్భంగా ఓపెనర్‌గా మెరిసిన రోహిత్ శర్మ ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన సిరిస్‌లోనూ చక్కటి ప్రదర్శన చేశాడు. గాయంతో వెస్టిండిస్ సిరీస్‌కు దూరమైన శిఖర్ ధావన్ శ్రీలంకతో టీ20, ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌తో కలిసి బరిలోకి దిగనున్నాడు. మరోవైపు టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా కూడా ఈ సిరిస్‌లో ఆడనున్నాడు.

బుమ్రాకు చోటు
వెన్నునొప్పితో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరిస్‌లకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌కప్ 2019 ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనలో మెరిసిన బుమ్రా ఆ తర్వాత టీమ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా, ఈ రెండు సిరిస్‌లకు సెలక్టర్లు ధోనీని పరిగణనలోకి తీసుకోలేదు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంతే కొనసాగనున్నాడు.

శ్రీలంకతో టీ20 సిరిస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీద్ బుమ్రా, నవ్‌ద్రిత్ బుమ్రా మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.

జనవరి 2020లో టీమిండియా పూర్తి షెడ్యూల్
శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్
జనవరి 5 - 1st T20I - గౌహతి
జనవరి 7 - 2nd T20I - ఇండోర్
జనవరి 10 - 3rd T20I - పూణె
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్
జనవరి 14 - 1st ODI - ముంబై
జనవరి 17 - 2nd ODI - రాజ్ కోట్
జనవరి 19 - 3rd ODI - బెంగళూరు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications