Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India : టీమిండియాకు మరోసారి షాకిచ్చిన బుమ్రా.. ఆస్ట్రేలియా టెస్టులకు కూడా..!

Jasprit Bumrah set to miss Newzealand and Australia series

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం టీమిండియాకు షాకుల మీద షాకులిస్తోంది. గతేడాది వెన్ను నొప్పితో జట్టుకు దూరమైన అతను.. ఆసియా కప్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడగానే మరోసారి అతని గాయం తిరగబెట్టింది. దీంతో సెలెక్టర్ల నిర్ణయం బెడిసికొట్టింది. కీలకమైన టీ20 వరల్డ్ కప్‌లో కూడా బుమ్రా ఆడలేకపోయాడు.

గాయంతో చాలాకాలంగా..

గాయంతో చాలాకాలంగా..

న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్ సిరీసులకు కూడా బుమ్రా అందుబాటులో లేడు. ఆ సమయాన్ని కూడా అతని రీహాబిలేషన్‌ కోసం వాడుకున్నాడు. బంగ్లాదేశ్ టెస్టుల్లో అయినా ఆడతాడని అనుకుంటే ఆ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో బుమ్రా మళ్లీ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడని అభిమానులు ఆలోచిస్తుండగా.. సడెన్‌గా అతన్ని శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు వెల్లడించారు.

దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తొలి వన్డే ప్రారంభం అవడానికి ఒక రోజు ముందు అంతే సడెన్‌గా బుమ్రాకు మరింత విశ్రాంతి అవసరం అని, అతను ఈ సిరీస్‌కు దూరమవుతున్నాడని బీసీసీఐ వెల్లడించింది.

మ్యాచ్‌కు ఒక్కరోజు ముందే..

మ్యాచ్‌కు ఒక్కరోజు ముందే..

మ్యాచ్ ప్రిపరేషన్‌లో భాగంగా మొదటి రోజు బుమ్రా మంచి ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాతి రోజు వర్క్‌లోడ్ పెంచడంతో అతని వెన్నులో కొంత ఇబ్బందిగా అనిపించిందట. దీంతో అతనికి మరింత విశ్రాంతి అవసరమని నిపుణులు భావించారు. దీంతో అతను శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు.

గతేడాది ఆస్ట్రేలియా సిరీస్ సమయంలో బుమ్రా విషయంలో తొందరపడినట్లు ఈసారి చేయకూడదని బీసీసీఐ గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అతను కొంచెం ఇబ్బంది అనగానే సిరీస్ నుంచి తప్పించేసింది. అయితే బుమ్రా గాయం గురించి అంత ఆందోళన అవసరం లేదని, అది చిన్న ఇబ్బందేనని టీమిండియా సారధి రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

ఆసీస్ సిరీస్‌కు కూడా..

ఆసీస్ సిరీస్‌కు కూడా..

ఈ లెక్కన బుమ్రా కోలుకోవడానికి కనీసం మరో మూడు వారాల సమయం అవసరం అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే న్యూజిల్యాండ్ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండబోడని సమాచారం. శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత జట్టు న్యూజిల్యాండ్‌తో సిరీస్ ఆడుతుంది. అంతేకాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా బుమ్రా పూర్తిగా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

ఈ సిరీస్‌లో భారత్ ఆడే నాలుగు టెస్టుల్లో చివరి రెండింటికి మాత్రమే బుమ్రా అందుబాటులో ఉంటాడట. మొదటి రెండు టెస్టుల్లో కూడా ఆడబోడని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

Story first published: Tuesday, January 10, 2023, 14:48 [IST]
Other articles published on Jan 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+