చేయాల్సిందంతా చేశాం: అభిమానులకు బుమ్రా బాధాకర సందేశం!

మాంచెస్టర్: ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో దిగ్భ్రాంతికర ఓటమిపై టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బాధాకర సందేశాన్ని ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. వైఫల్యం వల్ల చుట్టుముట్టిన నిరాశలో మునిగిన సమయంలో తనకు, జట్టుకు అండగా నిలిచినందుకు ఆయన తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. జట్టు సభ్యులు, కోచ్, సపోర్ట్ స్టాఫ్, కుటుంబ సభ్యులకు కృతజ్క్షతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అందరికంటే ముఖ్యంగా- గెలుపోటముల్లో తనకు అండగా నిలిచే అభిమానులకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.
ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో జట్టు ఓటమి పాలైనప్పటికీ..జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శన ఆకట్టుకుంది. టోర్నమెంట్ మొత్తం మీద బుమ్రా నిలకడగా రాణించాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో 18 వికెట్లను పడగొట్టాడు. ఓ బౌలర్‌గా తాను చేయాల్సిందంతా చేశానని బుమ్రా చెప్పుకొచ్చారు. ఇంత కంటే ఎక్కువ చేయలేమని అన్నారు. భవిష్యత్తులోనూ అభిమానులు జట్టుకు, తనకు అండగా నిలవాలని అకాంక్షించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications