Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah: నాపై రోహిత్ శ‌ర్మ‌కు న‌మ్మ‌కం ఎక్కువ‌.. గుడ్డిగా న‌మ్ముతాడు.. బుమ్రా ఆస‌క్తిర వ్యాఖ్య‌లు

Jasprit Bumrah says Rohit Sharma has faith in him and helped his career

కెప్టెన రోహిత్ శ‌ర్మ‌పై టీమిండియా స్పీడ్‌స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ క్ర‌మంలో త‌నలోని సామ‌ర్థ్యాన్ని వెలికి తీసినందుకు, ఐపీఎల్‌లో తాను ఆడే ప్రారంభ రోజుల్లో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచినందుకు రోహిత్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఈ ఐపీఎల్‌ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ గైర్హాజ‌రీలో శ్రీ‌లంక‌తో టీ20, టెస్ట్ సిరీస్‌కు కూడా వైస్ కెప్టెన్‌గా బుమ్రానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా రోహిత్ శ‌ర్మ‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి జ‌స్ప్రీత్ బుమ్రా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. బౌల‌ర్ల‌కు రోహిత్ శ‌ర్మ స్వేచ్ఛ ఇస్తాడ‌ని, అలాగే త‌న‌కు సొంతంగా ఫీల్డింగ్ సెట్ చేసుకునే అవ‌కాశం కూడా ఇస్తాడ‌ని తెలిపాడు.

టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ యుట్యూబ్ ఛానెల్‌లో రోహిత్ త‌న‌కు కెరీర్‌లో ఎలా సాయం చేశాడో బుమ్రా వివ‌రించాడు. తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మొద‌టి రోజుల నుంచి రోహిత్‌తో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని బుమ్రా తెలిపాడు. ఐపీఎల్‌లో తాను మొద‌ట‌గా అడుగుపెట్టిన‌ప్పుడు ముంబై ఇండియన్స్ జ‌ట్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ఉన్నాడ‌ని, అప్పుడు త‌న‌కు రెగ్యూల‌ర్‌గా అవ‌కాశాలు రాలేద‌ని తెలిపాడు. రోహిత్ శ‌ర్మ కెప్టెన్ అయ్యాక త‌న‌కు రెగ్యూల‌ర్‌గా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని చెప్పాడు. అత‌ను త‌న‌పై విశ్వాసాన్ని క‌ల్గి ఉన్నాడ‌ని, త‌న‌లోని నమ్మ‌కాన్ని పెంచాడ‌ని బుమ్రా తెలిపాడు.

నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే రోహిత్ శ‌ర్మ త‌న‌ను గ‌మ‌నించేవాడ‌ని జ‌స్ప్రీత్ బుమ్రా చెప్పాడు. త‌న‌ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి, తానెలా బౌలింగ్ చేయగలను వంటి విషయాలను అర్థం చేసుకున్నాడ‌ని తెలిపాడు. త‌న‌పై ఉన్న‌ నమ్మకంతో వ‌రుస‌గా అవ‌కాశాలు ఇవ్వ‌డ‌మే కాకుండా, త‌న‌కు కీల‌క‌ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం కల్పించాడ‌ని బుమ్రా చెప్పాడు. అది త‌న‌లో చాలా ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింద‌ని, తానిప్పుడు ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయ‌గ‌ల‌న‌ని ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేశాడు.

IND vs WI : India 2-0 Lead In T20I Series,Rohit Lauds At Bhuvneshwar Kumar | Oneindia Telugu

అలాగే రోహిత్ త‌న‌ నుంచి ఏం ఆశిస్తున్నాడో త‌న‌కు తెలుస‌ని, త‌న‌కు బాల్ ఇచ్చిన తర్వాత ఇలా వేయమని కూడా త‌న‌కు చెప్పడని, త‌న‌కు నచ్చినట్టు ఫీల్డింగ్ సెట్ చేస్తాడ‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ త‌న‌ను గుడ్డిగా న‌మ్ముతున్నాడ‌ని, తాను బౌలింగ్ చేసే స‌మ‌యంలో అత‌డు జోక్యం చేసుకోడ‌ని బుమ్రా వివ‌రించాడు. ప్ర‌స్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న బుమ్రా కెప్టెన్సీ కోసం ఆశ‌ప‌డ‌డం లేద‌ని చెప్పాడు. అయితే జ‌ట్టు తన‌కు ఏ బాధ్య‌త ఇచ్చిన విజ‌యవంతంగా నెర‌వేరుస్తాన‌ని వెల్లడించాడు. జ‌ట్టులో సీనియ‌ర్ ఆట‌గాడిగా ఉన్న‌ప్పుడు బాధ్య‌త‌లు వాటంత‌టా అవే వ‌స్తాయ‌ని బుమ్రా తెలిపాడు.

Story first published: Sunday, February 27, 2022, 14:42 [IST]
Other articles published on Feb 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+