Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గీత దాటారో అంతే!: బుమ్రా నోబాల్‌ని జైపూర్ పోలీస్ ఇలా

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా డెత్ బౌలర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్ ఎంత పని చేసిందో మన అందరికీ తెలిసిందే. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో పాక్ ఓపెనర్‌ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. అయితే అది నా బాల్ కావడంతో అతడు బతికిపోయాడు.

తనకు అందివచ్చిన లైఫ్‌ని సద్వినియోగం చేసుకున్న ఫకార్ జమాన్ ఆ తర్వాత భారత బౌలర్లను చీల్చి చెండాడు. ఈ క్రమంలో వన్డేల్లో తన తొలి సెంచరీని నమోదు చేసి పాకిస్థాన్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది.

Jasprit Bumrah's no-ball: Jaipur traffic police uses game-changing incident to promote road safety

దీంతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించడంతో ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. బుమ్రా వేసిన నో బాల్ వల్లే టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు.

అయితే ఈ సంద‌ర్భాన్ని వాడుకొని ప్ర‌జ‌ల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచాల‌ని కర్ణాటక కేడర్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ సంజ‌య్ అగ‌ర్వాల్‌ భావించారు. బుమ్రా నోబాల్ వేసిన ఫొటోను ఆయ‌న వాడుకున్నారు. గీత దాట‌కండి.. దాని ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్న సందేశం ఈ ఫొటో ద్వారా ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు.

ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సాధారణంగా యువత ట్రాఫిక్ రూల్స్‌ను పాటించరు. అయితే క్రికెట్ ద్వారా ఈ సందేశం ఇస్తే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో తాను ఇలా చేశానని,
రెడ్‌లైట్‌ను దాటి వెళ్తే అది వాళ్ల ప్రాణాల‌కే ప్ర‌మాదం అని చెప్ప‌డమే తన ఉద్దేశ‌మ‌ని సంజ‌య్ చెప్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+