అద్దె ఇల్లు.. ఆటో నడుపుతూ: దైన్య స్థితిలో క్రికెటర్ బుమ్రా తాత
హైదరాబాద్: జస్‌ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక ఆటగాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా బీసీసీఐ గ్రేడ్ బి కాంట్రాక్టు ఆటగాడిగా ఉన్నాడు. అంటే ఏడాదికి కోటి రూపాయల వేతనం లభిస్తుందన్నమాట.
దీంతో పాటు బుమ్రా ఆడే ప్రతి టెస్ట్‌కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ 20కి 3 లక్షలు బీసీసీఐ అదనంగా ఇస్తోంది. దీంతో పాటు ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం అదనం. ఇంత డబ్బుతో బుమ్రా కుటుంబం దర్జాగా బతుకుతున్నదని అందరూ అనుకోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.
బుమ్రాని పెంచి పెద్దచేసిన తాత సంతోక్‌సింగ్ బుమ్రా ప్రస్తుతం కష్టాలకు ఎదురీదుతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని కిచ్చా పట్టణం ఉద్ధమ్‌సింగ్ నగర్‌లో ఉంటున్న 84 ఏళ్ల సంతోక్‌సింగ్.. ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. టీమిండియా ఏదై నా క్రికెట్ మ్యాచ్ ఆడుతోందంటే చాలు.. టీవీకి అతుక్కుపోతాడు.

బుమ్రా బౌలింగ్‌కు దిగాడంటే
ఇక బుమ్రా బౌలింగ్‌కు దిగాడంటే ఆయన కళ్లు టీవీనే చూస్తుండిపోతాయి. గతంలో సంతోక్‌సింగ్ బాగా బతికినవాడే. అహ్మదాబాద్‌లో సొంతంగా మూడు ఫ్యాక్టరీలకు యాజమానిగా వ్యవహరించాడు. అయితే 2001లో బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించాడు. కానీ అప్పుడు బుమ్రాను అతడి తల్లి దల్జీత్‌సింగ్‌ను సంతోక్ సింగ్ తనవద్ద ఉంచుకోలేదు.

తీవ్ర వేదన చెందుతోన్న సంతోక్ సింగ్
దాంతో దల్జీత్‌సింగ్ ఎంతో బాధపడి ఉంటుందని సంతోక్ సింగ్ ఇప్పుడు తీవ్ర వేదన చెందుతున్నాడు. మరోవైపు బ్యాంక్ లోన్ల కోసం ఫ్యాక్టరీలు ఆమ్మెసి దశాబ్దం కిందట అహ్మదాబాద్‌నుంచి జీవనోపాధికోసం కిచ్చా వచ్చాడు. ఉద్ధమ్‌సింగ్ నగర్‌లో నాలుగు ఆటోలతో కొత్తవ్యాపారం మొదలుపెట్టాడు.

ఆటో డ్రైవర్‌గా
పరిస్థితులు అనుకూలించక వ్యాపారంలో నష్టాలు రావడంతో మూడు ఆటోలు అమ్మేశాడు. అయితే అందులో ఒకదానిని మాత్రం తానే నడుపుకుంటున్నాడు. 2010లో సంతోక్ భార్య చనిపోయింది. ప్రస్తుతం ఓ గదిలో ఉంటున్న బుమ్రా తాత.. ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు.

అహ్మదాబాద్‌లో బుమ్రా
ఇంట్లో ఉన్న ఏకైక ఖరీదైన వస్తువు ఓ పాత టీవీ. కేబుల్ బిల్లు కూడా సరిగా కట్టలేకపోతుండడంతో అది అప్పుడప్పుడే పని చేస్తుంది. అయితే తన మనువడు ఆడే మ్యాచ్‌లను టీవీల్లో చూస్తున్న సంతోక్ సింగ్.. ఇంత ఎత్తుకు ఎదిగినందుకు చాలా గర్వపడుతున్నాడు. అహ్మదాబాద్‌లో నివసించే బుమ్రాను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా? అని ఉవ్విళ్లూరుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications