ఆసియాకప్ ముందు టీమిండియాకు బిగ్గెస్ట్ షాక్.. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం.. ఎందుకంటే?

భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా... ఆగస్టు 27నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టును సోమవారం ప్రకటించాల్సి ఉన్నా ఇంకా ప్రకటన రాలేదు. అంతలోపు బుమ్రా ఆసియాకప్‌కు దూరమవుతున్నట్లు న్యూస్ వచ్చింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఎందుకు బుమ్రా దూరమంటే..
‘జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడతున్నాడు. అతను ఆసియా కప్‌లో ఆడబోడు. అతను మా ప్రధాన బౌలర్ కానీ.. టీ20 ప్రపంచకప్‌కు ముందు మేం అతన్ని జాగ్రత్తగా ఉంచాలనుకుంటున్నాం. అందువల్ల అతన్ని ఆసియా కప్ టీంలోకి ఎంపిక చేయట్లేదు. అతను వీలయినంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము. ఆసియా కప్‌కు ఇంకా 20 రోజులు ఉన్నప్పటికీ.. మేము అతన్ని రిస్క్ చేయించదల్చుకోవడం లేదు. ఆడిస్తే ఒకవేళ గాయం తీవ్రతరం కావచ్చు.' అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పీటీఐతో చెప్పారు.
వెస్టిండీస్ సిరీస్‌కు విశ్రాంతి
జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే జరగబోయే జింబాబ్వే పర్యటనకు కూడా అతనికి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఇక బుమ్రా చివరిసారిగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులో అతను కెప్టెన్సీ కూడా వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. ఇక ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్లో అతను గొప్పగా రాణించాడు. ఇక సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో, దక్షిణాఫ్రికాతో జరిగే వైట్-బాల్ హోమ్ సిరీస్‌కు అతను ఫిట్‌గా ఉండాల్సిన అవసరముంది. అందువల్ల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను తన ఫిట్ నెస్ మెరుగుపరచుకోవడంతో పాటు వెన్ను గాయానికి క్రికెట్ మెడికల్ నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స పొందనున్నాడు.
గతంలోనూ బుమ్రాకు ఇలాంటి సమస్యలు
బుమ్రాకు ఇప్పుడే కాదు ఇలాంటి సమస్యలు గతంలో కూడా ఎదురయ్యాయి. వెన్ను గాయంతో చాలా సార్లు అతను జట్టుకు దూరమైయ్యాడు. బుమ్రా తన కుటుంబంతో యునైటెడ్ స్టేట్స్‌లో ఇటీవలే విహారయాత్ర చేశాడు. బుమ్రా గాయపడడం భారత జట్టుకు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే అతను రెండు నెలల కంటే ఎక్కువ కాలం పాటు విశ్రాంతి మోడ్‌లో ఉండి తిరిగి గాడిలోకి రావడానికి కొన్ని మ్యాచ్‌లు అవసరం. ఇకపోతే ఆసియా కప్‌లో అతని స్థానంలో అతనికి తగ్గ బౌలర్ దొరకడం ప్రస్తుతం టీమిండియాకు కష్టమేనని చెప్పాలి. ఇక అతను దూరమయ్యాడనే వార్తతో నెట్టింట బుమ్రా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. పలువురు నెటిజన్లు చలోక్తి పోస్టులు చేస్తున్నారు. ఇక అతని ప్లేస్‌లో ఎవరు బెటరో మరీ. భారత అభిమానులు ఎవరు ఎంపికయితే బాగుంటుందో సూచించండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications