Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జిమ్‌లో బుమ్రా ప్రాక్టీస్‌ ఫోటో.. టీజ్‌ చేసిన మహిళా క్రికెటర్‌!!

Jasprit Bumrah posts a gym selfie, Danielle Wyatt takes a funny dig

ముంబై: టీమిండియా స్టార్ పేసర్‌, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నుగాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం నుండి జరగనున్న బంగ్లాదేశ్ సిరీస్‌లో కూడా లేడు. ప్రస్తుతం బుమ్రా వెన్నుగాయం నుంచి కోలుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో డిసెంబర్‌లో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ నాటికి బుమ్రా జట్టులోకి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అందుకు కారణం జిమ్‌లో కసరత్తులు చేయడమే.

తాజాగా జిమ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సెల్ఫీ ఫోటోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. టీమిండియా జట్టుకి త్వరలోనే జాయిన్‌ అవుతా అనే అర్థం వచ్చేలా.. 'కమింగ్‌ సూన్‌' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఈ సెల్ఫీపై ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌ స్పందించింది. 'బేబీ వెయిట్స్‌' (చిన్న పిల్లల ఎక్సర్‌సైజ్‌లు) అంటూ బుమ్రాను టీజ్‌ చేసింది. వ్యాట్‌ ఎక్కువగా విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోనీల గురించి కామెంట్లు చేసేది. కానీ.. ఈసారి బుమ్రాపై చేయడం విశేషం. గతంలో విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకోవాలని కూడా కోరింది.

గత కొన్ని రోజుల క్రితం బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని భావించినా అది అవసరం కాలేదు. ప్రస్తుతం తేలికపాటి ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నాడు. రన్నింగ్‌ ప్రాక్టీస్‌ను కూడా తన దినచర్యలో భాగం చేశాడు. బెంగళూరులోని క్రికెటర్ల పునరావస కేంద్రం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో బుమ్రా శిక్షణ తీసుకుంటున్నాడు. బుమ్రా వన్డేల్లోనే 103 వికెట్లు, టెస్టుల్లో 62 వికెట్లు, టీ20ల్లో 51 వికెట్లు సాధించాడు.

బుమ్రా చిన్నతనంలో ఎంతో కష్టపడేవాడు అని అతని తల్లి దల్జీత్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. బుమ్రా ఐదేళ్ల వయసున్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడని గుర్తు చేసుకుంది. 'నాన్న చనిపోయాక మేం చాలా కష్టపడ్డాం. ఏమీ కొనలేకపోయాం. నాకు ఒక జత షూ, ఒక జత టీ షర్టులు ఉండేవి. ప్రతి రోజు వాటిని ఉతికేసుకొని మళ్లీ వేసుకొనేవాడిని. ఆ కష్టాలన్నీ నన్ను మరింత దృఢంగా మార్చాయి. ఇప్పుడు అమ్మ, నేను అందరం బాగున్నాం' అని బుమ్రా పేర్కొన్నాడు.

Story first published: Friday, November 1, 2019, 10:17 [IST]
Other articles published on Nov 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+