Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy: బ్యాడ్ న్యూస్.. బుమ్రా ఔట్.. అతడి స్థానంలో ఎవరొచ్చారంటే?

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా ఆడతాడా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. అతడి స్థానంలో యంగ్ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ. మరోవైపు యశస్వి జైస్వాల్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. అతడిని నాన్‌ ట్రావెలింగ్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్ గా ఎంపిక చేశారు. అతడి స్థానంలో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని తీసుకున్నారు.

బుమ్రాను ఎందుకు పక్కన పెట్టారంటే?

వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ లో గాయపడిన బుమ్రాకు మొదట ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో చోటిచ్చారు. నిర్ణీత గడువులోగా అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలని నిర్ణయించారు. అతడు పూర్తిగా ఫిట్ నెస్ సాధించేందుకు నేషనల్ క్రికెట్‌ అకాడమీలోని మెడికల్ టీమ్ పర్యవేక్షణలో వైద్యాన్ని అందించారు. న్యూజిలాండ్ కు చెందిన ప్రత్యేక డాక్టర్ కూడా బుమ్రాకు చికిత్స అందించారు. కానీ ప్రయత్నం ఫలించలేదు.

రిపోర్ట్స్ ప్రకారం.. బుమ్రా గాయం నుంచి దాదాపు కోలుకున్నట్లే అని తెలిపిన మెడికల్ టీమ్.. ఎటువంటి ఇబ్బందీ లేకుండా మాత్రం బౌలింగ్‌ చేస్తాడన్న హామీని ఇవ్వలేదట. అందుకే బుమ్రాకు.. భవిష్యత్ పర్యటనల దృష్ట్యా ఇంకొంత కాలం విశ్రాంతి కల్పించారు.

Jasprit Bumrah out for ICC Champions Trophy 2025 Harshit Rana and Varun Chakaravarthy added

ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా జట్టు ఇదే:
రోహిత్‌ శర్మ (కెప్టెన్), విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజా.

నాన్‌ ట్రావెలింగ్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్లు : యశస్వి జైస్వాల్‌, శివం దూబె, మహ్మద్‌ సిరాజ్‌

Story first published: Wednesday, February 12, 2025, 8:31 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+