For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచంలోని అత్యుత్తమ డెత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు'

 Jasprit Bumrah one of the best death bowlers in the world, reckons Martin Guptill

హైదరాబాద్: రెండో టీ20లో న్యూజిలాండ్ ఓటమికి టీమిండియా సమిష్టి ప్రదర్శనే కారణమని కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ఈడెన్‌ పార్క్‌ ట్రాక్‌ స్లోగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయామని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాపై గుప్టిల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గుప్టిల్ మాట్లాడుతూ "పిచ్‌ చాలా మందకొడిగా మారిపోయింది. పిచ్‌ కారణంగానే మేము బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. పిచ్‌ మరీ నెమ్మదించడంతో బ్యాటింగ్‌ కష్టమైంది" అని అన్నాడు.

"కివీస్ టాపార్డర్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ, పిచ్‌ సహకరించని కారణంగా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. అయితే, పిచ్‌ నుంచి వచ్చిన సహకారాన్ని టీమిండియా బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి వరకు బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని నియంత్రించాడు" అని గుప్టిల్ అన్నాడు.

"బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనడం చాలా కష్టంగా మారింది. మేము 170 పరుగులు చేస్తే పోరాడే వాళ్లం. కానీ, టీమిండియా అద్భుతమైన బౌలింగ్‌తో అది సాధ్యం కాలేదు. భారత బౌలర్లు చాలా బంతులను డాట్‌ బాల్స్‌గా సంధించారు. దీంతో సాధ్యమైనన్ని పరుగులు చేయలేకపోయాం. మరోవైపు భారత్‌ బ్యాటింగ్‌లో కూడా రాణించింది" అని గుప్టిల్ చెప్పుకొచ్చాడు.

"బ్యాటింగ్‌లో వారు చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పారు. భారత్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు, మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. మేము ఎంత గొప్పగా బౌలింగ్‌ వేసినా కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల జోడీ చక్కటి భాగస్వామ్యాలను నెలకొల్పారు. వారి భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో మేము విఫలమయ్యాం. ఫలితంగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయాం" అని గుప్టిల్ అన్నాడు.

ఐదు టీ20ల సిరిస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరిస్‌ను టీమిండియా సాధిస్తుంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం హామిల్టన్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, January 27, 2020, 15:17 [IST]
Other articles published on Jan 27, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+