Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోర్బ్స్ జాబితా: బుమ్రాతో పాటు మరో నలుగురు క్రీడాకారులు

 Jasprit Bumrah one of four sportspersons to make it to 'Forbes India 30 Under 30'

హైదరాబాద్: ఫోర్బ్స్ ఆయా రంగాల్లో అత్యంత విలువైన వ్యక్తులుగా భావించి కొద్ది మందినే ఎంపిక చేసి వారి జాబితాను విడుదల చేస్తోంది. వారిలో ఇప్పుడు కొత్తగా 'ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30' అనే జాబితాను విడుదల చేసింది. అంటే 30 ఏళ్ల వయస్సు లోపు వాళ్ల 30 పేర్ల జాబితా అది.

దీనిలో నలుగురు క్రీడాకారుల పేర్లు నమోదయ్యాయి. వారు జస్ప్రిత్ బుమ్రా, హర్మన్ ప్రీత్ కౌర్, హాకీ గోల్ కీపర్ సవితా పూన్యా, షూటర్ హీనా సింధు. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ముప్పై మంది ఉన్న జాబితాను పొందుపరిచింది.

రెండేళ్లుగా ఆ కంపెనీ చేసిన పరిశీలన, పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని చివరిగా ఈ జాబితాను విడుదల చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. వ్యక్తిగత జీవితం, వారి ప్రొఫెషనల్ లైఫ్ తదితర అంశాలని అంచనా వేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.

గడిచిన రెండేళ్లలో బుమ్రా ప్రతిభ అమోఘమని కొనియాడింది. దక్షిణాఫ్రికా జట్టుతో జనవరి నెలలో జరిగిన రెండో టెస్టుకు బుమ్రా ప్రతిభ అసమానమైందని పేర్కొంది. భారత మహిళా క్రికెటర్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ గతేడాది భారత్ కు ప్రపంచ కప్ తీసుకురావడానికి చేసిన పరుగులను పొందుపరిచింది. తొమ్మిది మ్యాచ్‌లకు కలిపి 359పరుగులు చేసి తన యావరేజ్ 59.83గా ఉన్నట్లు పేర్కొంది.

సవితా హాకీ గోల్ కీపర్‌గా ఆడి భారత హాకీ జట్టులో ఆడిన ఆసియా కప్ గెలుచుకున్న జట్టులో భాగమైంది. గతేడాది న్యూఢిల్లీ వేదికగా జరిగిన 10మీటర్ల షూటింగ్ విభాగంలో హీనా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 17:47 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+