షమీ = బూమ్రా: ఆ రికార్డు సాధ్యమేనా? ఈ మ్యాచ్ దాటితే..ఆ ఛాన్స్ దక్కదు!

బర్మింగ్‌హామ్: టీమిండియా బౌలింగ్ తురుపుముక్క, యార్కర్ కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువగా నిలిచాడు. తన తోటి సహచర బౌలర్ మహమ్మద్ షమీ రికార్డుకు సమం చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ ఒక్క మ్యాచ్ దాటిపోతే.. ఇక ఆ అరుదైన రికార్డును అందుకోలేడు బుమ్రా. ఇంతకీ ఏమిటా రికార్డు. మొత్తానికి బుమ్రా ఆ రికార్డును అధిగమించగలడా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. దాన్ని అందుకోగలిగితే.. మహమ్మద్ షమీ పేరిట ఉన్న ఆ రికార్డును సమం చేయగలుగుతాడే తప్ప.. అధిగమించలేడు. అది వేరే విషయం.

ఇంతకీ ఏమిటా అరుదైన రికార్డు?
ఇంతగా చర్చనీయాంశమైన రికార్డు ఏమిటది? అతి తక్కువ మ్యాచుల్లో వంద వికెట్లను తీయడమే. ఇప్పటిదాకా టీమిండియా తరఫున దీన్ని సాధించినది మహమ్మద్ షమీ ఒక్కడే. మొత్తం 56 అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు మహమ్మద్ షమీ. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో కలుపుకొని షమీ ఇప్పటిదాకా మొత్తం 66 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 126 వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం మహమ్మద్ షమీ రికార్డు ముంగిట్లో నిలిచాడు జస్‌ప్రీత్ బుమ్రా.

56వ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా!
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ బుమ్రాకు 56వది. ప్రస్తుతం బుమ్రా తన వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ల కేరీర్‌లో 95 వికెట్లను తీసుకున్నాడు. ఇంకో అయిదు వికెట్లను పడగొట్టగలిగితే- షమీ రికార్డుకు చేరుకుంటాడు. అతనితో సమానంగా నిలుస్తాడు. తక్కువ వన్డేల్లో 100 వికెట్లను అందుకున్న ఆరో బౌలర్‌గా నిలుస్తాడు.

కోహ్లీ పేరిట రెండు రికార్డులు
దీనితోపాటు- విరాట్ కోహ్లీ పేరిట కూడా ఓ రికార్డు రెడీగా ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో 31 పరుగులు చేయగలిగితే చాలు! ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున వెయ్యి పరుగులు సాధించిన వాడవుతాడు. ఈ క్రమంలో మూడో ఆటగాడిగా రికార్డుల్లో చోటు సంపాదించుకుంటాడు. అలాగే- ఈ ఏడాది కేలండర్‌లో వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలుస్తాడు. ఈ కేలండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు చేయాలంటే కోహ్లీకి కేవలం ఏడు పరుగులు చాలు.

పాండ్యాకూ ఓ ఛాన్స్.. ఒక వికెట్ తీస్తే..
బౌలర్లలో హార్దిక్ పాండ్యా పేరు మీద కూడా ఇదే మ్యాచ్‌లో ఓ రికార్డు నెలకొల్పడానికి ఛాన్స్ ఉంది. బంగ్లాతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఒక వికెట్ తీసినా.. అతని కెరీర్‌లో అది మైలురాయిగా నిలుస్తుంది. ఎందుకంటే అతను 50 వికెట్లను పూర్తిచేసుకుంటాడు. 82 పరుగులు సాధిస్తే పాండ్యా కూడా వన్డేల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.
{headtohead_cricket_3_10}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications