Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah: టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన బుమ్రా..

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 ICC పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అతనితో పాటు శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్‌లు ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి నామినేట్ అయ్యారు. వెన్ను శస్త్రచికిత్స తర్వాత 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్ టెస్ట్ ఆడాడు. బుమ్రా 2024లో 13 టెస్టుల్లో 71 వికెట్లు తీశాడు. భారత తరఫున ఒక క్యాలెండర్ ఇయర్ లో 71 వికెట్లు సాధించిన ఐదో బౌలర్ గా నిలిచాడు.

కపిల్ దేవ్ 1983లో 18 మ్యాచ్‌లలో 75 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 12.83 సగటుతో 30 వికెట్లతో వికెట్ టేకర్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా 200 టెస్ట్ వికెట్లు కూడా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన అత్యంత వేగంగా భారత పేసర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ విశాఖపట్నంలో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్ల తీశాడు. అలాగే కెప్టెన్ గా వ్యవహరించి పెర్త్‌లో 295 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.

Jasprit Bumrah nominated for ICC Men s Test Cricketer of the Year award

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత, బుమ్రా ఐదు వికెట్ల ఆసీస్ వెన్ను విరిచాడు. కంగారులను 104 పరుగులకు ఆలౌట్ చేసింది భారత్. ఆస్ట్రేలియా నాలుగో ఇన్నింగ్స్‌లో 534 పరుగుల ఛేదనలో బుమ్రా మూడు వికెట్లు తీసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా వచ్చింది. ఐసీసీ పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి కూడా చేరుకున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా తన మొదటి టెస్ట్ మ్యాచ్ ను సౌతాఫ్రికాపై 2018లో ఆడాడు. తన మొదటి వన్డేను ఆస్ట్రేలియాపై 2016లో ఆడాడు. 43 టెస్టుల్లో 203 వికెట్లు తీశాడు. 89 వన్డేల్లో 149 వికెట్లు పడగొట్టగా.. 70 టీ20ల్లో 89 వికెట్లు తీశాడు.

Story first published: Monday, December 30, 2024, 15:57 [IST]
Other articles published on Dec 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+