ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా జస్ప్రీత్ బుమ్రాను టీమ్ ఆఫ్‌ది ఇయర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతను 2024లో 71 వికెట్లతో వికెట్ టేకర్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మూడు ఫార్మాట్లలో 84 వికెట్లతో 2024లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2024లో అంతర్జాతీయంగా అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడు వనిందు హసరంగా కేవలం 64 వికెట్లు మాత్రమే తీశాడు.
ఇద్దరి మధ్య 22 వికెట్ల తేడా ఉంది. 11 సంవత్సరాల తర్వాత భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించిన వారిలో బుమ్రా కీలకంగా ఉన్నాడు.
జూన్‌లో జరిగిన 2024 ఐసీసీ T20 ప్రపంచ కప్ జస్ప్రీత్ సత్తా చాటాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతే కాదు జట్టుకు విజయాన్ని అందించాడు. పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియాపై ఇండియా 295 పరుగులు తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో బుమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 20 వికెట్ల మాత్రమే తీశాడు. బుమ్రా కంటే 10 వికెట్ల వెనకాల ఉన్నాడు. బుమ్రా తన ప్రభావవంతమైన బౌలింగ్, అతని జట్టుకు అనుకూలంగా మ్యాచ్‌ను స్వింగ్ చేయగల సామర్థ్యం కారణంగా ఇప్పటికే లెజెండ్ హోదాను సాధించాడు.
బుమ్రాతో పాటు అతని సహచరుడు యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్, అలెక్స్ కారీ కూడా క్రికెట్ ఆస్ట్రేలియా 2024 అత్యుత్తమ జట్టులో తమ స్థానాన్ని దక్కించుకున్నారు. జైస్వాల్ ఈ ఏడాది 15 మ్యాచ్ ల్లో 1478 పరుగులు చేశాడు. ఇందులో 3 సెచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులో యశస్వి జైస్వాల్ (IND), బెన్ డకెట్ (ENG), జో రూట్ (ENG), రచిన్ రవీంద్ర (NZ), హ్యారీ బ్రూక్ (ENG), కమిందు మెండిస్ (SL), అలెక్స్ కారీ (AUS), మాట్ హెన్రీ (NZ), జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్) (IND), జోష్ హేజిల్‌వుడ్ (AUS), కేశవ్ మహారాజ్ (SA) ఉన్నారు.