న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాలో అంకితభావం, పాండ్యాలో పరుగుల దాహం: రోహిత్ శర్మ

IPL 2019 : Jasprit Bumrah More Mature, Hardik Pandya Also Stepping UP : Rohit Sharma
Jasprit Bumrah more mature, Hardik Pandya also stepping up: Rohit Sharma

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యాలపై ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో హార్ధిక్ పాండ్యా (32), బౌలింగ్‌లో బుమ్రా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ బుమ్రా రోజురోజుకు మరింత రాటుదేలుతున్నాడని, ఆటపై ఎంతో అంకితభావం ప్రదర్శిస్తున్నాడని కొనియాడాడు.

"బుమ్రా ఇప్పుడు మరింత పరిణతి సాధించాడు. ప్రతిరోజూ అతడి ప్రదర్శన మెరుగవుతోంది. ఎంతో అంకితభావం చూపిస్తాడు. తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఆట ఎలా ఉంటుందో మనకు తెలుసు. వారి భాగస్వామ్యం విడదీసేందుకు బుమ్రా తెలివిగా వ్వవహారించాడు" అని రోహిత్‌ అన్నాడు.

కోహ్లీ-డివిలియర్స్ భాగస్వామ్యాన్ని విడదీసి జట్టు విజయంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడని అన్నాడు. ఇక, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పరుగుల దాహం బాగా ఉందని అన్నాడు. "హార్దిక్‌ పాండ్యాలో పరుగులు దాహం ఉంది. చివర్లో అతడొచ్చి కీలక పరుగులు చేశాడు. కొన్ని పరుగులిచ్చినా మధ్య ఓవర్లలో చక్కగానే బౌలింగ్‌ చేశాడు" అని అన్నాడు.

"చివరి మ్యాచ్‌తో పోలిస్తే అతడి ప్రదర్శన మెరుగైంది. మలింగ సైతం అద్భుతంగా రాణించాడు. అంతేకాదు మలింగ శ్రీలంక జట్టుకు వన్డే కెప్టెన్‌గా ఉన్నాడు. వరల్డ్‌కప్‌లో రాణించాలని కోరుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి మంచి ఫామ్‌తో తిరిగొచ్చాడు" అని రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

Story first published: Friday, March 29, 2019, 19:53 [IST]
Other articles published on Mar 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X