Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: యార్కర్ కింగ్ ఈజ్ బ్యాక్!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సందడి మొదలైన వేళ ముంబై ఇండియన్స్ క్యాంపులో జోష్ పెరిగదింది. ఆ జట్టు ప్రధాన అస్త్రం, ప్రపంచ అత్యుత్తమ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు జట్టుతో చేరిపోయాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందే యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా జుట్టులో చేరడంతో ముంబై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జస్‌ప్రీత్ బుమ్రా ఎక్కడికి వెళ్లాడు? ఎందుకీ ఆలస్యం?
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. ఈ మెగా టోర్నీ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతనికి కొంత విశ్రాంతినిచ్చింది.

Jasprit Bumrah Joins Mumbai Indians Squad for IPL 2026 MI vs KKR Playing Update Details

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. ఆ మెగా టోర్నీ తర్వాత బుమ్రా వర్క్‌లోడ్‌ను (Workload) దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతనికి కొంత విశ్రాంతిని ఇచ్చింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE))లో రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. అక్కడ బుమ్రా ఫిట్‌నెస్‌ను వైద్య సిబ్బంది పర్యవేక్షించారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో బుమ్రా ఫిట్‌నెస్‌ విషయంలో బోర్డు చాలా జాగ్రత్తగా ఉంది.

ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
శుక్రవారం రాత్రి జస్ప్రీత్ బుమ్రా ముంబై చేరుకున్నాడు. శనివారం నుంచి బుమ్రా జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నాడు. ఆదివారం (మార్చి 29) వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

ముంబై ముందున్న సవాళ్లు..
ముంబై ఇండియన్స్‌కు ఓ విచిత్రమైన రికార్డు ఉంది. 2012 తర్వాత ఆ జట్టు ఐపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌ను గెలవలేదు. ఈసారి ఆ చెత్త రికార్డును చెరిపివేయాలని హార్దిక్ పాండ్యా సేన భావిస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్ ఇంకా జట్టుతో చేరాల్సి ఉంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరపున 186 వికెట్లు తీసిన బుమ్రా.. ఈ సీజన్‌లో కూడా తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Story first published: Saturday, March 28, 2026, 14:26 [IST]
Other articles published on Mar 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+