అనుకున్నదే జరిగింది.. టీ20 ప్రపంచకప్ నుంచి బుమ్రా ఔట్.. బీసీసీఐ అధికారిక ప్రకటన

అనుకున్నదే జరిగింది. టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టుకు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొన్నటి నుంచి పుంఖానుపుంఖాలుగా బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడంటూ వస్తున్న వార్తలు గాలివార్తలు కావు నిజమేనని తేలింది. ఈ విషయమై బీసీసీఐ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. బీసీసీఐ సెక్రెటరీ జై షా ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఆ ప్రకటనపై సంతకం చేశారు. బుమ్రా గాయంపై బీసీసీఐ మెడికల్ టీం తీవ్రంగా అసెస్ చేసిందని, గాయం తీవ్రత వల్ల బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడమే సరైందని పేర్కొనడంతో బుమ్రాను తప్పించక తప్పలేదని ప్రకటనలో పేర్కొంది. ఇకపోతే అతని స్థానంలో ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే ప్లేయర్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని కూడా పేర్కొంది.
సుమారు 4నుంచి 6నెలల పాటు రెస్ట్
వెన్ను నొప్పితో బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో బుమ్రా ఆడని విషయం తెలిసిందే. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో అతను వెన్ను నొప్పి వస్తుందని ఫిజియోలకు చెప్పడంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. మ్యాచ్ అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినప్పటికీ.. సుమారు 4-6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దాంతోనే అతను త్రివేండ్రం నుంచి గౌహతికి వెళ్లలేదని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలపగా.. బీసీసీఐ తాజాగా ధ్రువీకరించింది.

అప్పుడే ఫిట్‌నెస్‌పై సందేహాలు
జులైలో ఇంగ్లాండ్ పర్యటన అనంతరం ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. వెస్టిండీస్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. వన్డేలతో పాటు టీ20ల్లో కూడా బుమ్రా ఆడలేదు. ఆ తర్వాత భారత్ ద్వితియశ్రేణి జట్టు.. జింబాబ్వేలో కూడా పర్యటించింది. ఆ సిరీస్‌లో కూడా బుమ్రా ఆడలేదు. ఆసియాకప్ ముంగిట వెన్ను నొప్పితో దూరమయ్యాడు. ఆసీస్‌తో పర్యటనకు ముందే బుమ్రాతో పాటు హర్షల్ పటేల్‌కు ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో పాసైనట్లు కూడా పేర్కొన్నారు. దాంతోనే టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు ఎంపిక చేశారు. అయితే ఆసీస్‌తో తొలి మ్యాచ్‌లో కూడా బుమ్రా ఆడలేదు. అప్పుడే అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి.

ఆ ముగ్గురిలో ఒకరు
ఇప్పటికే రవీంద్ర జడేజా సేవలను కోల్పోయిన టీమిండియాకు బుమ్రా కూడా దూరమవడం కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఆసీస్ కండిషన్స్ బుమ్రా బౌలింగ్‌కు పక్కాగా సరిపోతాయి. ఈ క్రమంలోనే బుమ్రాను తీసుకొచ్చేందుకు బీసీసీఐ అత్యుత్సాహం చూపించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ట్ టెస్ట్ క్లియర్ చేసిన బుమ్రా.. మళ్లీ గాయపడటంతో ఎన్‌సీఏ ప్రమాణాలపై కూడా సందేహాలు కలుగుతున్నాయి. గతంలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ సైతం ఇలానే గాయం నుంచి కోలుకున్న వెంటనే గాయపడ్డారు. ఇక బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్‌లలో ఎవరు జట్టులో స్థానం పొందుతారో వేచి చూడాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications